ETV Bharat / city

మాడు పగిలిపోయేలా నిప్పులు కురిపిస్తున్న సూరీడు

వేసవి వచ్చేసింది. మళ్లీ ఉసూరుమనే నిట్టూర్పులు మొదలయ్యాయి. మాడు పగిలిపోయేలా నిప్పులు కురిపిస్తున్నాడు సూరీడు. పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. బాబోయ్ ఇవేం ఎండలు అనుకుంటూ ఉపశమనం పొందే దారులు వెతుక్కుంటున్నారు ప్రజలు. కొన్నిచోట్ల రికార్డుస్థాయిలో వేడి పెరుగుతోంది. ఈ వేడికి తోడు వడగాల్పులు ఇబ్బంది పెడుతున్నాయి. మధ్యభారతం నుంచి వీస్తున్న వేడి గాలులు ఉక్కపోత పెంచుతున్నాయి. ఏప్రిల్‌ ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగత్రలు ఉంటే మే నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇంకొన్నాళ్ల పాటు వాతావరణం పొడిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు.

author img

By

Published : Apr 8, 2021, 4:28 AM IST

temperatures are going to rise day by day in last 15 days in Telangana
మాడు పగిలిపోయేలా నిప్పులు కురిపిస్తున్న సూరీడు
మాడు పగిలిపోయేలా నిప్పులు కురిపిస్తున్న సూరీడు

అటకెక్కిన కూలర్లు మళ్లీ కిందకు దింపుతున్నారు. కాస్త కలిగిన వాళ్లు ఏసీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వరుస కడుతున్నారు. డాబాలపైన కూల్‌ పెయింటింగ్‌లు వేయించు కుంటున్నారు. తెలుగురాష్ట్రాల్లో 10 రోజులుగా ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచే సూర్యుడి ఉగ్రరూపం. సాయంత్రం 7గంటలు దాటినా చల్లబడని వాతావరణం. విపరీతమైన ఉక్కపోత. తట్టుకోలేనంత ఉష్ణోగ్రత. దాదాపు పది రోజులుగా ఇదీ పరిస్థితి. సూర్యోదయం నుంచే మొదలవుతోంది వేడి. ఎండల ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఎప్పుడు ఇంటికెళ్లిపోతామా అని ఆగమేఘాలపైన పనులు ముగించుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బైక్‌పై వెళ్తున్న వారు కొద్దిసేపు చెట్ల నీడన సేదతీరుతూ..గమ్యస్థానం చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గత 15 రోజుల్లో భారీ మార్పులు..

గతేడాది కరోనా కారణంగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఉష్ణోగ్రతలు పెరిగినా పెద్దగా ప్రభావం కనిపించలేదు. ప్రస్తుతం.. పరిస్థితులు కుదుటపడుతుండం వల్ల రోజువారీ పనుల నిమిత్తం రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారులు సాధారణ కార్యక్రమాలు సాగిస్తున్నారు. మార్చి 20 వరకు వాతావరణం చల్లగానే ఉన్నా 15 రోజుల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వారం రోజులుగా ఎండల తీవ్రత బాగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎండలు భగ్గమంటున్నాయి. ప్రజలు మధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దాదాపు 38, 39 డిగ్రీలుగా నమోదవుతూ వస్తున్నాయి ఇక్కడి ఉష్ణోగత్రలు. మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాల్పులు వీస్తాయని...ఫలితంగా..ఉష్ణోగ్రతలు పెరుగుతాయని 2రోజుల క్రితమే ఐఎండీ హెచ్చరించింది.

మూడో స్థానంలో తెలంగాణ..

అధిక ఉష్ణోగత్రలు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ మొదటి 2 స్థానాల్లో ఉండగా...తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో చాలా ప్రాంతాలోలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ‌లు దాటి నమోదవుతున్నాయి. మంగ‌ళ‌వారం అత్యధికంగా ఆది‌లా‌బాద్‌ జిల్లా తాంసిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. హైదరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు తదితర జిల్లాల్లో ఎండల ధాటి ఎక్కువగా ఉంటోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటం వల్ల సాధారణం కన్నా 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.7 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీ‌ల వరకూ రికార్డ్ అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

గాల్లో తేమ 10 శాతమే..

రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుదల కనిపిస్తోంది. హైద‌రా‌బా‌ద్‌లో గరిష్ఠ ఉష్ణో‌గ్రత 39.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణో‌గ్రత 25.8 డిగ్రీలుగా రికార్డైంది. మంగ‌ళ‌వారం అత్యధికంగా ఆది‌లా‌బాద్‌ జిల్లా తాంసిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దు‌కాగా, అర్లి(బి), బేల, చేప్రాల, జైనథ్‌, నిర్మల్‌ జిల్లా విశ్వనా‌థ‌పే‌టలో 41.7 డిగ్రీల చొప్పున నమో‌ద‌య్యాయి. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.7 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీ‌లుగా రికార్డయింది. గాలిలో తేమ ఆది‌లా‌బా‌ద్‌లో 10 శాతమే నమో‌దు‌ కాగా...రాష్ట్రంలో సగటు 42% నుంచి 88 శాతం వరకు నమో‌దైంది. ప్రస్తుతమున్న సమాచారం ఆధారంగా చూస్తే...అత్యధికంగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగత్రలు నమోదయ్యాయి.

స్థిరంగా ఉపరితల ఆవర్తనం..

ఇక్కడ ఎండల ధాటి 2 రోజుల్లో కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసరాల్లో సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ లతో పాటు సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. కొద్ది రోజులుగా ఎండల ధాటికి విలవిలలాడుతున్న ప్రజలు ఈ కబురు కాస్త ఊరటనిచ్చింది.

ఇవీ చూడండి: తిరుపతి వెళ్తున్నారా? ఆ తేదీ వరకే సర్వదర్శనాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.