ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - telugu latest updates

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Top news in telugu, telangana news
తెలుగు టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Jan 22, 2022, 11:00 AM IST

బండి సంజయ్​ ఫిర్యాదుపై లోక్​సభ ప్రివిలేజ్​ కమిటీ నోటీసులు జారీ చేసింది. సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.

  • 'పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం మోసం చేసింది'

పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం చేతిలో మోసపోయి పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. 'మనకు ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా తెదేపా వారికి అండగా ఉంటుందని' అన్నారు.

  • స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 3,37,704 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 488 మంది మరణించారు. 2,42,676 మంది కొవిడ్​ను జయించారు.

  • వివాహితపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు

వివాహితపై లైంగిక దాడి కేసులో భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ ఆంతోటి వినయ్‌కి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మహిళా కోర్టు, ఎనిమిదో అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్యాంశ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు.

  • 'పుష్ప' సినిమాలో కేశవుడు మనోడే..

'పుష్ప' సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్‌ ఓ రేంజ్‌లో నటనని పండించారు.. ఆయన పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా.. అంటూ ఉండే కేశవ ఎవరో కాదు మనోడే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడెపాకకు చెందిన బండారి జగదీశ్‌ ప్రతాప్‌. అనతి కాలంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్‌ హీరో పక్కన నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

  • 20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి.

  • సచిన్​ వీరాభిమాని సుధీర్​​ను కొట్టిన పోలీసులు..

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్​కు బిహార్​లోని ఓ పోలీస్​స్టేషన్​లో చేదు అనుభవం ఎదురైంది. కస్టడీలో ఉన్న తన సోదరుడ్ని కలిసేందుకు వెళ్లిన సుధీర్​పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు సుధీర్.

  • పునీత్​కు ఓటీటీ సంస్థ నివాళి..

స్టార్ హీరో పునీత్​కు ఘనంగా నివాళి ఇచ్చేందుకు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. పునీత్ నటించి, నిర్మించిన ఐదు సినిమాలను.. అభిమానులు ఉచితంగా చూసే అవకాశం కల్పించింది.

  • శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో 2.7 కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద 2.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • మావోయిస్టుల దుశ్చర్య..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనులు చేస్తుండగా 12 వానాలకు నిప్పు పెట్టారు. రహదారి నిర్మాణం పూర్తయితే వారి ఉనికికి ప్రమాదమని భావించి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం.

  • బండి సంజయ్​ ఫిర్యాదుపై వారికి నోటీసులు

బండి సంజయ్​ ఫిర్యాదుపై లోక్​సభ ప్రివిలేజ్​ కమిటీ నోటీసులు జారీ చేసింది. సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.

  • 'పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం మోసం చేసింది'

పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం చేతిలో మోసపోయి పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. 'మనకు ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా తెదేపా వారికి అండగా ఉంటుందని' అన్నారు.

  • స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 3,37,704 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 488 మంది మరణించారు. 2,42,676 మంది కొవిడ్​ను జయించారు.

  • వివాహితపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు

వివాహితపై లైంగిక దాడి కేసులో భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ ఆంతోటి వినయ్‌కి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మహిళా కోర్టు, ఎనిమిదో అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్యాంశ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు.

  • 'పుష్ప' సినిమాలో కేశవుడు మనోడే..

'పుష్ప' సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్‌ ఓ రేంజ్‌లో నటనని పండించారు.. ఆయన పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా.. అంటూ ఉండే కేశవ ఎవరో కాదు మనోడే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడెపాకకు చెందిన బండారి జగదీశ్‌ ప్రతాప్‌. అనతి కాలంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్‌ హీరో పక్కన నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

  • 20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి.

  • సచిన్​ వీరాభిమాని సుధీర్​​ను కొట్టిన పోలీసులు..

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్​కు బిహార్​లోని ఓ పోలీస్​స్టేషన్​లో చేదు అనుభవం ఎదురైంది. కస్టడీలో ఉన్న తన సోదరుడ్ని కలిసేందుకు వెళ్లిన సుధీర్​పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు సుధీర్.

  • పునీత్​కు ఓటీటీ సంస్థ నివాళి..

స్టార్ హీరో పునీత్​కు ఘనంగా నివాళి ఇచ్చేందుకు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. పునీత్ నటించి, నిర్మించిన ఐదు సినిమాలను.. అభిమానులు ఉచితంగా చూసే అవకాశం కల్పించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.