ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​న్యూస్​@ 11AM - తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news
author img

By

Published : Jan 6, 2022, 10:59 AM IST

వనపర్తి జిల్లా కిరీటంలో మరో వజ్రం చేరింది. జిల్లా కేంద్రం వనపర్తిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూ మంజూరు చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలకు ఉపక్రమించింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా ఈ నెల 3వ తేదీన జీఓ జారీ చేశారు.

  • 60 లక్షల మందికి పైగా లబ్ధి

తెలంగాణలో గత వారం రోజులుగా రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేస్తోంది. ఇప్పటి వరకు రైతుబంధు సాయం రూ.6,008.27 కోట్లు రైతుల ఖాతాల్లో జమైంది. 60,16,697 మంది అన్నదాతలకు లబ్ధి చేకూరింది.

  • అటారీ-వాఘా సరిహద్దు​లో రిట్రీట్​ సందర్శన నిలిపివేత

అట్టారీలోని భారత్​-పాకిస్థాన్ సరిహద్దులో నిత్యం జరిగే... ఫ్లాగ్ లోయరింగ్​ రిట్రీట్​ సందర్శనను నిలిపివేస్తున్నట్లు సరిహద్ద భద్రతా దళం(బీఎస్​ఎఫ్) తెలిపింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సరిహద్దు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

  • ప్రమాద ఘంటికలు

అమెరికాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం మరో 7 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. 1800 మంది మరణించారు. ఫ్రాన్స్​లో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డుస్థాయిలో 3.32లక్షల కేసులు వెలుగుచూశాయి. బ్రిటన్​, ఇటలీలో కొత్త కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. స్పెయిన్​, అర్జెంటీనా, టర్కీల్లోనూ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

దేశంలో బంగారం ధర రూ.260 మేర పెరిగింది. మరోవైపు.. వెండి ధర క్షీమించింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో సెన్సెక్స్​ 544 పాయింట్లు నష్టపోయి 59,678కి చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 161 పాయింట్లు కోల్పోయి 17,764 వద్ద ట్రేడవుతోంది.

  • ద్రవిడ్​తో కలిసి కోహ్లీ నెట్​ ప్రాక్టీస్

దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడో టెస్టుకు టీమ్ఇండియా కెప్టెన్​ కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. నెట్స్​లో కోచ్​ ద్రవిడ్​తో కలిసి విరాట్​ ప్రాక్టీస్​ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన అభిమానులు వీడియోను వైరల్​ చేస్తున్నారు.

  • గ్రామీ అవార్డుల వేడుక వాయిదా

అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న ఒమిక్రాన్ కారణంగా ఈనెల చివర్లో జరగాల్సిన గ్రామీ అవార్డుల వేడుక వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు.

  • మళ్లీ విజృంభణ

దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 90,928 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు 2,630కి పెరిగాయి.

  • పాల్వంచ ఘటనలో వెలుగులోకి సెల్ఫీ వీడియో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు.

  • వనపర్తికి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల

వనపర్తి జిల్లా కిరీటంలో మరో వజ్రం చేరింది. జిల్లా కేంద్రం వనపర్తిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూ మంజూరు చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలకు ఉపక్రమించింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా ఈ నెల 3వ తేదీన జీఓ జారీ చేశారు.

  • 60 లక్షల మందికి పైగా లబ్ధి

తెలంగాణలో గత వారం రోజులుగా రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేస్తోంది. ఇప్పటి వరకు రైతుబంధు సాయం రూ.6,008.27 కోట్లు రైతుల ఖాతాల్లో జమైంది. 60,16,697 మంది అన్నదాతలకు లబ్ధి చేకూరింది.

  • అటారీ-వాఘా సరిహద్దు​లో రిట్రీట్​ సందర్శన నిలిపివేత

అట్టారీలోని భారత్​-పాకిస్థాన్ సరిహద్దులో నిత్యం జరిగే... ఫ్లాగ్ లోయరింగ్​ రిట్రీట్​ సందర్శనను నిలిపివేస్తున్నట్లు సరిహద్ద భద్రతా దళం(బీఎస్​ఎఫ్) తెలిపింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సరిహద్దు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

  • ప్రమాద ఘంటికలు

అమెరికాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం మరో 7 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. 1800 మంది మరణించారు. ఫ్రాన్స్​లో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డుస్థాయిలో 3.32లక్షల కేసులు వెలుగుచూశాయి. బ్రిటన్​, ఇటలీలో కొత్త కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. స్పెయిన్​, అర్జెంటీనా, టర్కీల్లోనూ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

దేశంలో బంగారం ధర రూ.260 మేర పెరిగింది. మరోవైపు.. వెండి ధర క్షీమించింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో సెన్సెక్స్​ 544 పాయింట్లు నష్టపోయి 59,678కి చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 161 పాయింట్లు కోల్పోయి 17,764 వద్ద ట్రేడవుతోంది.

  • ద్రవిడ్​తో కలిసి కోహ్లీ నెట్​ ప్రాక్టీస్

దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడో టెస్టుకు టీమ్ఇండియా కెప్టెన్​ కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. నెట్స్​లో కోచ్​ ద్రవిడ్​తో కలిసి విరాట్​ ప్రాక్టీస్​ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన అభిమానులు వీడియోను వైరల్​ చేస్తున్నారు.

  • గ్రామీ అవార్డుల వేడుక వాయిదా

అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న ఒమిక్రాన్ కారణంగా ఈనెల చివర్లో జరగాల్సిన గ్రామీ అవార్డుల వేడుక వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.