ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM - తెలంగాణ సమాచారం

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telugu top news in telangana
టాప్ న్యూస్ @ 3PM
author img

By

Published : Mar 12, 2022, 2:57 PM IST

  • కేసీఆర్​ ఆరోగ్యంపై ఆందోళన చెందా

Governor Wishes To CM KCR: సీఎం కేసీఆర్​ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు​ కేసీఆర్​కు లేఖ రాసిన గవర్నర్​.. త్వరగా కోలుకోవాలని కోరుతూ పుష్పగుచ్ఛం పంపించారు.

  • సీఎంకు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay Open Letter to KCR: ప్రజా సమస్యలపై నిలదీస్తూ.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి సమస్యలను వివరిస్తూ.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

  • 'నా కొడుకు జోలికొస్తే ఊరుకునేది లేదు'

తన కుమారులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ హెచ్చరించారు. తన వద్ద నుంచి సురేశ్ రూ.82 లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని శరణ్ అనే వ్యాపారి చేసిన ఆరోపణలపై స్పందించారు. తాను డబ్బు తీసుకున్నట్లు ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు

  • ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టు

Field Assistants Arrested: 14 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించిన తమను నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తొలగించారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరిలో పది మందిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

  • కీవ్​ను చుట్టుముట్టిన బలగాలు

ఉక్రెయిన్​లోని కీవ్​ సహా పలు చోట్ల ఎయిర్​ రైడ్​ సైరన్లు వినిపించాయి. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.

  • ప్రజలపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. ఒకరు మృతి

Odisha MLA rams vehicle into crowd: ఒడిశా ఖుర్దాలో లఖింపుర్​ ఖేరి తరహాలోనే దుర్ఘటన జరిగింది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్​ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది భాజపా కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. వారిని భువనేశ్వర్​ ఎయిమ్స్​కు తరలించారు.

  • కారులోనే స్విమ్మింగ్​ పూల్​, హెలిప్యాడ్​..!

orld's Longest Car: ఓ కారులో అత్యధికంగా 10 మంది కూర్చోవచ్చు. లిమోసిన్​ లాంటి పొడవైన కారులో 18 మంది ప్రయాణించొచ్చు. కానీ 70 మంది ప్రయాణించగలిగే కారు గురించి విన్నారా? అమెరికన్​ డ్రీమ్​గా పేర్కొనే ఈ కారు ప్రస్తుతం అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

  • చిరుత మాంసంతో విందు..చివరికి!

Leopard Killed: చిరుతను వేటాడి విందు చేసుకొని.. చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తొలి భారతీయ చిత్రంగా 'ఆర్​ఆర్​ఆర్' మరో రికార్డ్..

RRR canada fans special video with cars: మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందానికి వినూత్న రూపంలో విషెస్​ తెలిపారు కెనడాలోని ఎన్టీఆర్​ ఫ్యాన్స్​. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్​ఆర్​ఆర్'​ ఆకృతిలో వాటిని అమర్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసిన మూవీ టీం సదరు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ​

  • విండీస్​పై భారీ విజయం

Worldcup 2022 Ind Vs Wi Match: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భారత క్రికెట్​ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 155 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్​పై ఘన విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.