దేశవ్యాప్తంగా చట్టసభల కంప్యూటరీకరణ కోసం లోక్‌సభ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో 7 రాష్ట్రాల స్పీకర్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్పీకర్లు పోచారం శ్రీనివాసరెడ్డి, తమ్మినేని సీతారాం ఉన్నారు. చట్టసభల పనితీరు, సభ్యులకు అందించే సేవలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
పలు కమిటీలకు ఛైర్మన్లు, సభ్యుల నియామకం
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా.. పలు కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించారు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావును పార్లమెంట్ లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా ప్రకటించారు.
లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ పదవి ఏపీ, నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజును వరించింది.
ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"