తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సులు సర్వీసులు పునరుద్దరించేందుకు ఆర్టీసీ అధికారులు భేటీ అయ్యారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో జరిగే ఈ సమావేశానికి ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. కరోనా కారణంగా ఏడు నెలలుగా నిలిచిపోయిన ఏపీ, తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి గతంలో జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీలు మూడుసార్లు సమావేశమైనా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. దసరా పండగ నేపథ్యంలో సర్వీసులపై తాత్కాలిక ఒప్పందానికి ఇరురాష్ట్రాల అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్ని సర్వీసులు నడపాలి.... ఎన్ని కిలోమీటర్లు నడపాలన్నదానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.