ETV Bharat / city

MLC Election Polling 2021 : కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLC Election Polling 2021 : తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికిగానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

MLC Election Polling 2021
MLC Election Polling 2021
author img

By

Published : Dec 10, 2021, 8:54 AM IST

MLC Election Polling 2021 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలకు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరుగుతోంది.

Local Body Quota MLC Election Polling 2021 : ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 37 పోలింగ్‌ కేంద్రాల్లో 5,326 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.

CEO Shashank Goyal : నిర్మల్ జిల్లాలో జడ్పీ, ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 253 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.