చైనాలోని వుహాన్ నగరంలో తెలుగు ఇంజినీర్లు చిక్కుకుపోయారు. ప్రాంగణ నియామకాల ద్వారా శ్రీసిటీ టీసీఎల్ కంపెనీకి ఎంపికై... శిక్షణ నిమిత్తం మొత్తం 96 మంది మూడు నెలల శిక్షణ కోసం వుహాన్ వెళ్లారు. ఆగస్టు 2019లో చైనా వెళ్లినవారిలో 38 మంది నవంబర్‌లోనే తిరిగి వచ్చారు. మిగిలిన 58 మంది మాత్రం వుహాన్‌లోని కంపెనీ హాస్టల్‌లోనే ఉండిపోయారు.
కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో స్వస్థలాలకు చేరుద్దామని కంపెనీ ప్రయత్నించింది. ఆప్పటికే నిషేధం నిబంధనలు అమల్లోకి రావడంతో కంపెనీ నిస్సహాయిత ప్రకటించింది. శిక్షణ పొందుతున్న బృందంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులు ఉన్నారు. భారత్‌కు రప్పించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.