ETV Bharat / city

Telugu academy assets: 'రెండు వారాల్లో ఏపీ ప్రభుత్వానికి నిధులు బదిలీ చేస్తాం'

author img

By

Published : Sep 14, 2021, 8:21 PM IST

తెలుగు అకాడమీ స్థిర, చర ఆస్తుల పంపకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారించింది. ఆస్తుల పంపకం విషయంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న.. జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పలు సూచనలు చేసింది.

telugu academy funds will transfer to ap government with in two weeks

తెలుగు అకాడమీ స్థిర, చర ఆస్తుల పంపకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అకాడమీకి చెందిన స్థిరాస్తులను కూడా పంచాలన్న ఆంధ్రప్రదేశ్‌ విధానంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసు దాఖలు చేసింది. స్థిర, చరాస్తుల పంపకాలపై ఇప్పటివరకు అనుసరించిన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వివరించింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 52:48 పద్ధతిలో పంపకాలు జరుగుతున్నట్లు తెలిపిన ప్రభుత్వం... చరాస్తుల పంపకాలు పూర్తయ్యాయని కోర్టుకు తెలిపింది.

బ్యాంకు బ్యాలెన్సు పట్టిక ప్రకారం తెలంగాణ నిధులు బదిలీ చేయలేదని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా.. స్థిరాస్తుల్లో కూడా వాటా వస్తుందని ఏపీ ప్రభుత్వం వాదించింది. ముందు చరాస్తుల పంపకాలు, బ్యాంకుల్లో ఉన్న నిధుల బదిలీ వంటి అంశాలను పరిష్కరించుకోవాలని జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇరు రాష్ట్రాలకు సూచించింది. బ్యాంకులో ఉన్న నిధులు రెండు వారాల్లో ఏపీ ప్రభుత్వం ఖాతాకు బదిలీ చేస్తామని ధర్మాసనానికి తెలంగాణ సర్కారు తెలిపింది. మిగిలిన విషయాలు తదుపరి విచారణలో పరిశీలించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.