ETV Bharat / city

రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...!

రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఐఎండీ అధికారులు తెలిపారు.

telangana weather report today
telangana weather report today
author img

By

Published : Apr 12, 2021, 3:04 PM IST

రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రదేశాల్లో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 14న మధ్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా... గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈరోజు ఇంటీరియర్ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ దూరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ సంచాలకులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.