ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు రవాణాశాఖ ఆన్‌లైన్ సేవలను విస్తరించింది. మరో 5 రకాల సేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ (ఫెస్ట్)ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఫెస్ట్ ద్వారా డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్‌లను రవాణాశాఖ జారీ చేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ షీట్, పాత కార్డు స్థానంలో స్మార్ట్ కార్డుల జారీ చేయనుంది. ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా బ్యాడ్జ్‌లను ఇవ్వనుంది.
ఇవీచూడండి: ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం