ETV Bharat / city

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @9AM
top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : Feb 21, 2022, 9:10 AM IST

  • విశ్వనాథుని సన్నిధి.. ఎవరికో పెన్నిధి..

UP Varanasi Election 2022: వారణాసిలో రాజకీయ వేడి పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో భాజపాదే హవా. ఇక్కడ మరింత పట్టు సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలు ప్రతి ఎన్నికల్లో ప్రాబల్యం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కుల సమీకరణాలపైనే ఆశలు పెట్టుకున్నాయి.

  • విశాఖలో ఫ్లీట్​ రివ్యూ..

President Fleet Review: భారత నౌకా శక్తిని మదింపు చేసే 'ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ' ఇవాళ విశాఖ తీరంలో జరగనుంది. ఈ పరేడ్‌లో పాల్గొనేందుకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. రామ్‌నాథ్‌ కోవింద్​కు.. ఏపీ సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఘన స్వాగతం పలికారు. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

  • ఠాణాల్లో అత్యాధునిక కెమెరాలు

CC Cameras: పోలీస్‌ ఠాణాల్లో సీసీ కెమెరాల వ్యవస్థకు చికిత్సచేసే కీలక కార్యాచరణకు తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. దేశంలోని పలు ఠాణాల్లో తరచుగా కస్టడీ మరణాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది.

  • గొర్రెల పంపిణీ పథకం అమలుపై అనిశ్చితి

Sheep Distribution Scheme: గొర్రెల పంపిణీ పథకం తాత్కాలికంగా నిలిచిపోయింది. నిధుల కొరత ఈ పథకానికి అడ్డంకిగా మారింది. రుణం ఇవ్వాలని ఎన్సీడీసీకి రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య దరఖాస్తు చేయగా.. రుణం ఇంకా మంజూరు కాలేదు. ఇవి వస్తేనే కాపరులకు పూర్తిస్థాయిలో పంపిణీ సాధ్యమవుతుంది.

  • పుట్టినరోజు నాడే బాలిక​పై సామూహిక అత్యాచారం

Girl Gangrape: ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మానవమృగాలు. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • ప్లేగులోనూ పైశాచికంగా..

అడుగడుగునా భారతీయులను కించపరచటమో, అవమానించటమో, వివక్ష చూపించటమో చేసిన ఆంగ్లేయులు ఆఖరుకు ప్లేగు మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ పైశాచికంగా ప్రవర్తించారు. మహిళలను వివస్త్రలుగా చేసి రోడ్లపై నిలబెట్టి ఆనందించారు. బ్రిటన్‌లోనూ ఆందోళన వ్యక్తమైన ఈ నిస్సిగ్గు సంఘటనలో ఆఖరికి బాధ్యుడైన ఆంగ్లేయ అధికారికి ప్రజలే తగిన శిక్ష విధించారు.

  • డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌ రెడీ..

Trump Social Media App: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు చెందిన సోషల్​ మీడియా యాప్ ప్రారంభమైంది. 'ట్రూత్‌ సోషల్‌ (TRUTH Social)' పేరుతో ఉన్న ఈ యాప్​ ఫిబ్రవరి 21న అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇది యాపిల్‌కు చెందిన యాప్‌ స్టోర్‌లోనే అందుబాటులో ఉండనుంది.

  • 1.7 మి.డాలర్ల ఎన్‌ఎఫ్‌టీలు దొంగిలించిన హ్యాకర్లు

OpenSea NFT marketplace: నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ మార్కెట్‌ప్లేస్ అయిన 'ఓపెన్‌సీ' హ్యాకింగ్‌ బారినపడింది. దాదాపు 1.7 మిలియన్‌ డాలర్లను హ్యాకర్లు దొంగలించినట్లు తెలుస్తోంది. యూజర్ల ఇ-మెయిల్‌ ఐడీ వంటి వివరాలు లీక్‌ అవ్వడం వల్లే ఈ సైబర్‌ దాడి జరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • టీమ్‌ఇండియా వయా వైమానిక దళం

Saurabh Kumar Cricketer: ఇటీవల బీసీసీఐ యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంపై ప్రాధాన్యం పెంచింది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్​తో మరో కొత్త ఆటగాడు భారత జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. అతడే సౌరభ్​ కుమార్​. అతడి గురించే ఈ కథనం..

  • వెండితెరపై 'తెలుగు' వెలుగులు

Telugu title movies: ఈ మధ్య కాలంలో టాలీవుడ్​ చిత్రాలకు మళ్లీ మునపటి తెలుగు వెలుగులు కనిపిస్తున్నాయి. పలువురు దర్శక నిర్మాతలు, హీరోలు తమ సినిమాలకు స్వచ్ఛమైన తెలుగు పేర్లను టైటిల్స్​గా పెట్టుకుంటున్నారు. నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా అచ్చమైన తెలుగు పేర్లతో రానున్న చిత్రాలు ఏంటో తెలుసుకుందాం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.