ETV Bharat / city

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @9PM
top ten news: టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Feb 6, 2022, 8:57 PM IST

  • లతా మంగేష్కర్​కు కన్నీటి వీడ్కోలు

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ప్రధాని మోదీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొని ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. కేంద్ర ప్రభుత్వం.. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది.

  • పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... 9 మంది మృతి

ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉరవకొండ మండలం బుదగవి వద్ద కారును లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బళ్లారిలో పెళ్లికి వెళ్లి... కారులో అనంతపురానికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. చూడటానికే ఒళ్లు గగుర్పొడిచేలా మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

  • యాదాద్రికి సీఎం కేసీఆర్​

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాకుంభ సంప్రోక్షణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. రేపు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి వెళ్తారు.

  • 'ఏడాది చివరికల్లా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం'

Minister Koppula: భాజపా నేతలకు మొదటి నుంచి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిపోయిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. దళితులు, బీసీ, ఎస్సీల పక్షాన ఏనాడు మాట్లాడని భాజపా నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆరోపించారు.

  • చన్నీనే సీఎం అభ్యర్థి.. సిద్ధూ ఊరుకుంటారా మరి?

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది.. పంజాబ్​ ఎన్నికలకు పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. చన్నీవైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. ఈ నిర్ణయం ఎన్నికల్లో విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం పక్కనబెడితే.. దీని వల్ల పార్టీలో అంతర్గత కలహాలు తప్పదా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ముందు నుంచీ ఆ పదవిని ఆశిస్తున్న సిద్ధూ.. తన అడుగులు ఎటువైపు వేస్తారనేది తేలాల్సి ఉంది.

  • 'వారంతా ఆఫీస్​లకు రావాల్సిందే'.. ఆ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం

Covid Cases In India: కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 26,729 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దిల్లీలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించాలని సూచించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​.

  • యూపీలో వ్యూహం మార్చిన భాజపా

UP polls 2022: యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా అభివృద్ధి మంత్రం జపించే అధికార పార్టీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. యాదవేతర ఓబీసీ వర్గాల్లో కొందరు, బ్రాహ్మణుల్లో కొందరు తమకు దూరమవుతున్నారన్న సమాచారంతోనే భాజపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే అభివృద్ధి కంటే ఇతర అంశాలపై దృష్టి సారిస్తోంది.

  • ఆ రాష్ట్రంలో 15 రోజులు లతా మంగేష్కర్ పాటలే

Lata Mangeshkar demise: దివంగత గాయని లతా మంగేష్కర్​కు వివిధ రాష్ట్రాలు ఘన నివాళులు అర్పించాయి. గాయని మృతి నేపథ్యంలో కర్ణాటకలో రెండు రోజులు సంతాప దినాలను పాటించనున్నారు. బంగాల్​లోని బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద 15 రోజుల పాటు లతాజీ పాటలను ప్రసారం చేయనున్నారు.

  • గానకోకిల లతా మంగేష్కర్ మౌనవ్రతం చేసిన వేళ.. ఎందుకంటే?

Lata mangeshkar songs: ఎన్నో వేల పాటలు పాడిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్.. కెరీర్​ పీక్ స్టేజ్​లో కొన్నాళ్లు మౌనవ్రతం చేశారు. ఇంతకీ ఎందుకంటే?

  • భారత్ ధమాకా.. విండీస్​పై ఘన విజయం

విండీస్​తో వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా బోణీ కొట్టింది. బ్యాటింగ్​లో రోహిత్ శర్మ.. బౌలింగ్​లో చాహల్ చెలరేగిన వేళ.. ఘన విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.