ETV Bharat / entertainment

మమ్ముట్టి, మోహన్‌ లాల్ - 16 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి - MAMMOOTTY MOHANLAL NEW MOVIE

16 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్న మమ్ముట్టి, మోహన్ లాల్ - సినిమా డీటెయిల్స్ ఇవే.

Mammootty Mohanlal New Movie
Mammootty Mohanlal New Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2024, 9:20 AM IST

Mammootty Mohanlal New Movie : మలయాళ స్టార్ హీరోలు అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లు మోహన్‌ లాల్, మమ్ముట్టి. ఈ ఇద్దరు అక్కడికి ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారు. వీరిద్దరి కాంబినేషన్‌లో చాలానే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2008లో విడుదలైన ట్వంటీ 20 సినిమా తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్‌ లెంగ్త్‌ సినిమా చేయలేదు.

అయితే ఇప్పుడు ఈ బడా హీరోలు మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం మెగాస్టార్‌ 429 (వర్కింగ్‌ టైటిల్‌). దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు అగ్ర హీరోలు మళ్లీ కలిసి చేయడంతో సినిమాపై అంచనాలు మంచిగానే ఉన్నాయి. మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్‌ వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్‌ నారాయణన్‌ ఈ మల్టీస్టారర్​ను తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్‌ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

రీసెంట్​గానే స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో ప్రారంభం అయినట్లు తెలిసింది. మమ్ముట్టి, మోహన్‌లాల్, కుంచాకోల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

ఈ చిత్రంలో హీరోయిన్​గా దక్షిణాదికి చెందిన ఓ నటితో మూవీ టీమ్​ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో కుంచకో బోబన్, ఆసిఫ్‌ అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం. కాగా, మమ్ముట్టి హీరోగా నటించిన కాదల్‌ కదన్ను ఒరు మాతుకుట్టి (2013) చిత్రంలో మోహన్‌లాల్‌ నటించారు. అయితే ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ది అతిథి పాత్ర.

ఇకపోతే మోహన్ లాల్ ప్రస్తుతం బరోజ్​, కన్నప్ప, ఎల్​ 2 : ఎంపురాన్​, రామ్​, వృషభ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. మమ్ముట్టి విషయానికొస్తే బజూకా, డొమినిక్​ అండ్ ది లేడీస్ పర్స్​ సినిమాల్లో నటిస్తున్నారు.

పవన్‌ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'ఓజి' సర్​ప్రైజ్​ ఆ రోజే

షారుక్‌ ఖాన్‌ కొడుకు ఎంట్రీకి రంగం సిద్ధం - కానీ హీరో కాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.