ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @5PM
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Jan 2, 2022, 4:55 PM IST

  • ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా?

Omicron Natural vaccine: ఒమిక్రాన్ వ్యాప్తి మంచిదేనా? ఈ వేరియంట్ నేచురల్ వ్యాక్సిన్​లా పనిచేసి కొవిడ్​ను అంతం చేస్తుందా? మహారాష్ట్ర వైద్యాధికారి చేసిన పలు వ్యాఖ్యలతో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆయనేం చెప్పారు? దీనిపై ఇతర నిపుణులు ఏమన్నారు? ఓసారి చూస్తే...

  • త్వరలో యాదాద్రికి సీఎం కేసీఆర్

CM KCR visit to Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్​ సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంక్రాంతి పర్వదినం తర్వాత కేసీఆర్​.. యాదాద్రికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  • యాదాద్రికి వెల్లువెత్తిన విరాళాలు

Gold Donation for Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం తాపడానికి బంగారం విరాళాలు భారీగా వస్తున్నాయి. హెటిరో డ్రగ్స్, హానర్ ల్యాబ్స్ రూ.2.50 కోట్ల విరాళం అందజేశారు. మంత్రి సత్యవతి రాఠోడ్ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. అనంతరం స్వామివారిని దర్శనం చేసుకొని... తీర్థప్రసాదాలు స్వీకరించారు.

  • 'నేరస్థులతో జైళ్లలో ఆటాడుకుంటున్న యోగి!'

Major Dhyan Chand Sports University: ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో మేజర్ ధ్యాన్​చంద్​ క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రధాని మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. గత పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు నేరస్థులకు అండగా నిలిచాయని ఆరోపించారు. యోగి ప్రభుత్వం.. నేరస్థులతో ఇప్పుడు ఆటాడుకుంటోందని ప్రశంసించారు.

  • బంగాల్​లో విద్యాసంస్థలు బంద్​

West Bengal Restrictions: మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బంగాల్​లో ఆంక్షలను విధించింది అక్కడి ప్రభుత్వం. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం సహా 50 శాతం సిబ్బందితోనే కార్యాలయాలు పనిచేయాలని స్పష్టం చేసింది.

  • నదిలోకి బస్సు​.. ముగ్గురు దుర్మరణం

Bus Accident: డ్రైవర్​ నిద్రమత్తులో తూగుతూ బస్సును నడిపి నదిలోకి తీసుకెళ్లాడు. వంతెనపై నుంచి 15 అడుగుల లోతులో బస్సు పడగా.. ముగ్గురు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

  • సోమవారం నుంచి పిల్లలకు టీకా

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 15-18ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందించనున్నారు. ఇందుకోసం దిల్లీ, ముంబయితో పాటు ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పిల్లలకు టీకాలు అందించేందుకు దిల్లీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిలక్​ నగర్​లోని ఓ వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని పిల్లల ఇష్టాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఆటవస్తువులు, పుస్తకాలు ఏర్పాటు చేశారు. టీకా వేసుకున్న వారు ఇండోర్​ గేమ్స్​ ఆడేందుకు ప్రత్యేక గదిని కేటాయించారు.

  • పాక్​ వక్రబుద్ధి మరోసారి బహిర్గతం

Infiltration Bid: సరిహద్దుల్లో పాక్​ వక్రబుద్ధి మరోసారి బహిర్గతమైంది. పాకిస్థాన్​ బోర్డర్​ యాక్షన్​ టీమ్​ చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది.

  • 'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్లాన్ సిద్ధం చేశా'

Venkatesh Iyer All-Rounder: దక్షిణాఫ్రికా పర్యటన కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు యువ ఆటగాడు వెంకటేశ్​ అయ్యర్​. అక్కడి పిచ్​లపై రాణించేందుకు తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నట్లు చెప్పాడు.

  • 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ

Radhe Shyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్' సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ వాయిదా పడిన నేపథ్యంలో 'రాధేశ్యామ్​' విడుదల తేదీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై స్పష్టతనిచ్చారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.