ETV Bharat / city

Telangana News : టాప్​న్యూస్ @7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jul 28, 2022, 6:58 PM IST

కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. కార్యకర్తలతో సంప్రదింపులు మూడు రోజులకు చేరిన నేపథ్యంలో.. మిశ్రమ స్పందన వస్తోంది. భాజపాలో చేరేందుకు సిద్ధమైనా.. రాజీనామా చేయాలా..? పార్టీ సస్పెండ్​ చేసేవరకు ఆగాలా..? అన్న అయోమయంలోనే రాజగోపాల్​రెడ్డి ఇంకా ఉన్నారు.

  • యాదాద్రి టూ హన్మకొండ..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న ప్రారంభంకానుంది. ఇప్పటికే పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. యాదాద్రి పుణ్య క్షేత్రం నుంచి భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు యాత్ర సాగనుంది.

  • 8 ఏళ్ల తర్వాత భద్రాచలానికి చంద్రబాబు..

దాదాపు 8 ఏళ్ల తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భద్రాచలంలో అడుగు పెట్టారు. దీనితో తెదేపా శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటిస్తోన్న చంద్రబాబు... వరద బాధితులను పరామర్శించి.. రేపు రామయ్యను దర్శించుకోనున్నారు.

  • హైదరాబాద్‌లో మిషన్ కాకతీయ ఏమైంది?: ఎన్వీఎస్ఎస్

పాతబస్తీని ఎనిమిదేళ్లైనా ఎందుకు అభివృద్ధి చేయలేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్ ప్రశ్నించారు. మూసీ, అనేక చెరువుల వల్ల కాలనీలు మోకాళ్ల లోతు నీళ్లలోనే ఉన్నాయన్నారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

  • విండీస్​ దీవుల్లో టీమ్​ఇండియా ప్లేయర్స్

ఐర్లాండ్, ఇంగ్లాండ్, విండీస్‌ ఇలా వరుసగా ప్రత్యర్థులపై సిరీస్​లు గెలిచిన ఆనందంలో టీమ్​ఇండియా ప్లేయర్స్​ చిల్​ కొడుతున్నారు. ప్రస్తుతం విండీస్​ దీవుల్లో తమ భార్యలతో కలిసి ఫుల్​ ఎంజాయ్​ చేస్తున్నారు.

  • చెస్ పండగ షురూ..

44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్ పాల్గొన్నారు.

  • రామ్​చరణ్​కు హాలీవుడ్ ఆఫర్​..

ప్రముఖ హాలీవుడ్​ నిర్మాత, రైటర్​ చియో హోదారి కోకర్ ​.. మెగాహీరో రామ్​చరణ్​పై ప్రశంసలు కురిపించాడు. జేమ్స్​ బాండ్​ పాత్రను.. చరణ్​ బాగా పోషించగలడని సోషల్​మీడియాలో ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

  • 'అవెంజర్స్'​ రేంజ్​లో 'ప్రాజెక్ట్​ కె'..

ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్​ కె' సినిమాపై బిగ్​ అప్డేట్​ ఇచ్చారు నిర్మాత అశ్వనీ దత్​. 'అవెంజర్స్​' తరహాలో పాన్​ వరల్డ్​గా మూవీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023లో ప్రభాస్​ పుట్టినరోజున రిలీజ్​ చేసే అవకాశముందని చెప్పారు.

  • 'దేనికైనా ఓ హద్దు ఉంటుంది'..

కేసుల విచారణలో జాప్యంపై మీడియాలో ప్రచురితమైన కొన్ని కథనాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. విచారణ విషయంలో న్యాయమూర్తులను విమర్శించడానికి ఒక హద్దు ఉండాలని అన్నారు.

  • బంగాల్​ మంత్రి పార్థాపై వేటు

ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టైన బంగాల్​ మంత్రి పార్థా ఛటర్జీని బర్తరఫ్ చేశారు. ఈ మేరకు బంగాల్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆయన నిర్వహిస్తున్న శాఖలను ఇకపై తాను చేపడతానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

  • 'ప్రాణం ఇస్తాం కానీ.. మీ వెంట రాలేం'..

కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. కార్యకర్తలతో సంప్రదింపులు మూడు రోజులకు చేరిన నేపథ్యంలో.. మిశ్రమ స్పందన వస్తోంది. భాజపాలో చేరేందుకు సిద్ధమైనా.. రాజీనామా చేయాలా..? పార్టీ సస్పెండ్​ చేసేవరకు ఆగాలా..? అన్న అయోమయంలోనే రాజగోపాల్​రెడ్డి ఇంకా ఉన్నారు.

  • యాదాద్రి టూ హన్మకొండ..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న ప్రారంభంకానుంది. ఇప్పటికే పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. యాదాద్రి పుణ్య క్షేత్రం నుంచి భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు యాత్ర సాగనుంది.

  • 8 ఏళ్ల తర్వాత భద్రాచలానికి చంద్రబాబు..

దాదాపు 8 ఏళ్ల తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భద్రాచలంలో అడుగు పెట్టారు. దీనితో తెదేపా శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటిస్తోన్న చంద్రబాబు... వరద బాధితులను పరామర్శించి.. రేపు రామయ్యను దర్శించుకోనున్నారు.

  • హైదరాబాద్‌లో మిషన్ కాకతీయ ఏమైంది?: ఎన్వీఎస్ఎస్

పాతబస్తీని ఎనిమిదేళ్లైనా ఎందుకు అభివృద్ధి చేయలేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్ ప్రశ్నించారు. మూసీ, అనేక చెరువుల వల్ల కాలనీలు మోకాళ్ల లోతు నీళ్లలోనే ఉన్నాయన్నారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

  • విండీస్​ దీవుల్లో టీమ్​ఇండియా ప్లేయర్స్

ఐర్లాండ్, ఇంగ్లాండ్, విండీస్‌ ఇలా వరుసగా ప్రత్యర్థులపై సిరీస్​లు గెలిచిన ఆనందంలో టీమ్​ఇండియా ప్లేయర్స్​ చిల్​ కొడుతున్నారు. ప్రస్తుతం విండీస్​ దీవుల్లో తమ భార్యలతో కలిసి ఫుల్​ ఎంజాయ్​ చేస్తున్నారు.

  • చెస్ పండగ షురూ..

44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్ పాల్గొన్నారు.

  • రామ్​చరణ్​కు హాలీవుడ్ ఆఫర్​..

ప్రముఖ హాలీవుడ్​ నిర్మాత, రైటర్​ చియో హోదారి కోకర్ ​.. మెగాహీరో రామ్​చరణ్​పై ప్రశంసలు కురిపించాడు. జేమ్స్​ బాండ్​ పాత్రను.. చరణ్​ బాగా పోషించగలడని సోషల్​మీడియాలో ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

  • 'అవెంజర్స్'​ రేంజ్​లో 'ప్రాజెక్ట్​ కె'..

ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్​ కె' సినిమాపై బిగ్​ అప్డేట్​ ఇచ్చారు నిర్మాత అశ్వనీ దత్​. 'అవెంజర్స్​' తరహాలో పాన్​ వరల్డ్​గా మూవీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023లో ప్రభాస్​ పుట్టినరోజున రిలీజ్​ చేసే అవకాశముందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.