ETV Bharat / city

3PM TOPNEWS 3పీఎం టాప్​న్యూస్ - 3పీఎం టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 28, 2022, 2:48 PM IST

  • పేకమేడల్లా కూలిన ట్విన్​ టవర్స్

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో అక్రమంగా నిర్మితమైన వంద మీటర్లు ఎత్తయిన జంట టవర్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ముంబయికి చెందిన ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్‌ డిమాలిషన్స్‌ కలిసి ఈ పని విజయవంతంగా చేపట్టాయి.

  • రైతు సంఘాల నేతలతో రెండో రోజు సీఎం కేసీఆర్​ సమావేశం

దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కర్షక సంఘాల నేతలతో సీఎం కేసీఆర్​ రెండో రోజు సమావేశమయ్యారు. దేశంలో వ్యవసాయ రంగం, రైతాంగ సంక్షేమం, పరిస్థితులు, వ్యవసాయ రంగ సమస్యలకు కారణాలు, పరిష్కార మార్గాలపై రైతు సంఘాల నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు.

  • ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గుండు సున్నా అంటూ కేటీఆర్ ట్వీట్​

వైద్య విద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప చరిత్ర లిఖించారని మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్రం ఎన్ని కాలేజీలు మంజూరు చేసిందో సమాధానం చెప్పాలని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

  • ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదన్న బండి సంజయ్‌

ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ అమలు చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఓ స్కామ్​ల్లో అయినా ముఖ్యమంత్రి కుటుంబీకులు ఉంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు.

  • లక్షలు పోయాయి, కొలువు పోయింది, చివరికి కన్నీరే కొలువైంది

ఉద్యోగాలంటూ దళారుల చెప్పిన మాటలకు లక్షల రూపాయలు అప్పు తెచ్చి యువత కొలువుల్లో చేరారు. అది మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. తరవాత ఉద్యోగాల నుంచి తొలగించడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు జీతం పెరిగితే జీవితం బాగుంటుందని కలలు కన్నారు. కానీ ఇంతలోనే ఇలా అవ్వడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఏం అయ్యింది.

  • మందుబాబుకు వింత అనుభవం, మద్యం సీసాలో వ్యర్థాలు

ఏపీలోని వైఎస్సార్​ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో కొనుగోలు చేసిన ఓ మద్యం సీసాలో వ్యర్థాలు ఉండటం చర్చనీయాంశమైంది. ఇలాంటి మద్యాన్ని ఎలా తాగాలని మందు బాబు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి వరకు వెళ్లింది.

  • చేతిలో చిన్నారి మృతదేహం, గుండెల నిండా దుఃఖం

అభం శుభం తెలియని ఆ రెండేళ్ల చిన్నారి ఏడ్చిందని సవతి తల్లి రోడ్డు మీదకు విసిరేసింది. అదే సమయంలో అటు నుంచి వస్తున్న కారు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది. అయితే పోస్టుమార్టం పూర్తయ్యాక చిన్నారి మృతదేహాన్ని తీసుకుళ్లేందుకు అంబులెన్స్​ లేక ఆమె తండ్రి చేతిలో పట్టుకుని బరువైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన యూపీలో జరిగింది.

  • మూడు టన్నుల సిమెంట్ గంగపాలు

కర్ణాటకలో శుక్రవారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా యాదగిరి జిల్లా షాహపుర మండలం మదరకల్​ గ్రామం వద్ద వంతెనపై నుంచి హిరేహళ్ల నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఈ వంతెనపై వెళ్తున్న ఓ లారీ నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం డ్రైవర్​ను కాపాడారు. ఆ లారీలో మూడు టన్నుల సిమెంట్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  • ఫ్యాన్స్​ జాగ్రత్త, భారత్​ పాక్​ మ్యాచ్ చూస్తే రూ.5 వేలు జరిమానా

ఆసియా కప్‌ 2022లో భాగంగా నేడు జరగనున్న టీమ్​ఇండియా పాకిస్థాన్​ మ్యాచ్​ చూడారాదంటూ ఓ కాలేజీ ఆంక్షలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

  • దృశ్యం 3 కన్ఫార్మ్​ చేసిన మూవీటీమ్​

ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మర్డర్​ మిస్టరి సినిమా దృశ్యం సిరీస్​. ఇప్పుడీ సిరీస్​లో భాగంగా మూడో పార్ట్​ రాబోతుంది. ఈ విషయాన్ని మూవీటీమ్​ అధికారంగా ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.