ETV Bharat / city

Telangana top news 3పీఎం టాప్​న్యూస్ - 3పీఎం టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 25, 2022, 2:59 PM IST

  • ఝార్ఖండ్​ సీఎంకు బిగ్​ షాక్​- అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్​ రమేశ్​ బైస్​కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.

  • విమానాశ్రయంలో రూ.3.80 కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుకున్నారు. 9 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద 7.3 కిలోల బంగారం జప్తు చేశారు. వీటి విలువ 3.80కోట్లు.

  • రాజాసింగ్‌ రిమాండ్‌పై హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు

రాజాసింగ్‌ రిమాండ్‌పై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రిమాండ్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుంది.

  • రాజాసింగ్​కు పోలీసుల నోటీసులు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ అరెస్టయి బెయిల్​పై విడుదలైన ఎమ్మెల్యే రాజాసింగ్​కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాత కేసులన్ని తవ్వి ఇప్పుడు అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని రాజాసింగ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • జర్నలిస్టులకు గుడ్​న్యూస్​

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు తీపికబురు వినిపించింది. సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న జర్నలిస్టుల సమస్యకు పరిష్కారం చూపింది. ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతూ తీర్పునిచ్చింది.

  • వివాహేతర సంబంధానికి మరొకరు బలి

వివాహేతర సంబంధానికి మరో ప్రాణం బలయ్యింది. ప్రేమ వివాహమే అయినా మరొకరితో సాన్నిహిత్యం హత్యకు దారితీసింది. ఇదేంటని నిలదీసినందుకు స్నేహితుడే కిరాతకంగా అతడిని హతమార్చాడు. మృతదేహాం కూడా దొరక్కుండా మాయం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

  • ఆప్​ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్​ భేటీ, కొందరు మిస్​​, భాజపా పనేనా

ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను భాజపా తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ తన నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 62 మంది ఆప్​ ఎమ్మెల్యేలకుగాను 53 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భారతీయ జనతా పార్టీ చేసిన ఆపరేషన్ కమలం విఫలమైందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది.

  • బంగారంతో భారీ గణపతి

అందరూ ఎదురుచూస్తున్న మన గణేశుని పండుగ త్వరలో రానుంది. చవితి నాడు ఇళ్లలోనే కాదు వీధుల్లో దర్శనమిచ్చే వినాయకులను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. విభిన్నరకాల గణపతులను చూసే భక్తుల కోసం యూపీలోని ఛందౌసీలోనూ ఓ గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు.

  • క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్‌న్యూస్‌

క్రికెట్​ అభిమానులకు గుడ్​ న్యూస్​. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​లో భాగంగా జరగబోయే భారత్​ పాకిస్థాన్ మ్యాచ్​కు సంబంధించి నాలుగు వేలకుపైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను విడుదల చేసింది ఐసీసీ. ఒక్కో టికెట్‌ 30 ఆస్ట్రేలియన్ డాలర్లకు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో కేటాయిస్తామని వెల్లడించింది.

  • భారీగా పెరిగిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే

దేశంలో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.