ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 7PM - టాప్ న్యూస్ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 20, 2022, 6:58 PM IST

  • ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో, ఎవరికీ భయపడేది లేదన్న సీఎం కేసీఆర్

నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ధ్వజమెత్తారు. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదన్న సీఎం విభజన హామీలు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.

  • ప్రేమికురాలితో పెళ్లి కోసం సినిమా స్టైల్లో ట్రై చేశాడు, కానీ జరిగింది వేరు

తాను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినిమాల్లో బెదిరించినట్టు చేస్తే అంతా సెట్​ అవుతుందనుకున్నాడు ఓ ప్రేమికుడు. బిల్డింగ్​ ఎక్కి కాసేపు హంగామా చేశాడు. అతను అనుకున్నట్టు జరుగుతుందనుకున్నాడు. కాకపోతే ఇక్కడ మాత్రం వేరే జరిగింది.

  • సందీప్‌కు ఏమైనా జరిగితే ఆత్యహత్య చేసుకుంటామన్న తల్లిదండ్రులు

నారాయణ కళాశాల ఘటనలో గాయపడిన విద్యార్థి నాయకుడు సందీప్‌ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేరే విద్యార్థికి సాయం చేసేందుకు వెళ్లిన తన కుమారుడికి ఏమైనా జరిగితే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామన్నారు.

  • ఆర్మూర్​లో అదృశ్యమైన చిన్నారి, జగిత్యాలలో రోడ్డు పక్కన ఇలా

శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించాల్సిన ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన చిన్నారితో అనుమానాస్పదంగా నిద్రిస్తున్నాడు. అటుగా వెళ్లిన పోలీసు అధికారులు గుర్తించడంతో ఆ చిన్నారి సేఫ్​గా బయటపడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

  • 2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంపై జరిగిన సీబీఐ దాడుల్లో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని భాజపా విమర్శించింది. ఈ దాడుల విషయంలో కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉంటారని ఆరోపించింది.

  • విద్యార్థినిపై అరాచకాలు, ట్యూషన్ టీచర్​కు దేహశుద్ధి, రోడ్డుపై ఈడ్చుకుంటూ

పెళ్లి చేసుకుంటానని నమ్మించి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ ట్యూషన్ టీచర్. ఈ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు ప్రియురాలిపై ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రియుడు. ఈ దారుణం ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

  • రెండో వన్డేలోనూ భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ దూకుడు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టును గత మ్యాచ్​లో కంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అయితే, తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేయగా.. తాజాగా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

  • ఆ దేశ ప్రధానికి డ్రగ్స్​ పరీక్ష, మిత్రులతో పార్టీ చేసుకున్నందుకే

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో ప్రధాని డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించగా తాజాగా ఆమె డ్రగ్స్‌ పరీక్ష చేయించుకున్నారు.

  • నెలకు రూ.9వేల పెన్షన్, అప్లై ఎలా చేసుకోవాలో తెలుసా

పింఛ‌ను హామీనిచ్చే ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న ప‌థకం మరికొన్ని నెలల్లో ముగియనుంది. సీనియర్‌ సిటిజ‌న్లు ఈ పథకానికి ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

  • సింధుకు ఆ వ్యక్తి బెదిరింపు లేఖ, కిడ్నాప్​ చేస్తానంటూ

ఇప్పటి వరకు తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆ సంగతులివీ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.