ETV Bharat / city

5PM TOPNEWS: తెలంగాణ 5పీఎం టాప్​న్యూస్

author img

By

Published : Aug 11, 2022, 4:58 PM IST

ఇప్పటివరకున్న ప్రధానవార్తలు..

5PM TOPNEWS
5PM TOPNEWS

  • ప్రారంభమైన మంత్రివర్గ భేటీ.. వాటిపైనే చర్చించే అవకాశం..!

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ అయ్యింది. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం. కొత్త పెన్షన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్ చర్చించనుంది.

  • 'వారిద్దరి కుట్రలో భాగమే మునుగోడు ఉపఎన్నిక'

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భాజపా, తెరాస అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను 5నిమిషాల్లో స్పీకర్‌ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు.

  • రాష్ట్రంలో బూస్టర్​డోసుకు డిమాండ్.. నిండుకున్న కొవిషీల్డ్ నిల్వలు

రాష్ట్రంలో బూస్టర్​డోసుకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో.. రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరీజీ కేంద్రంలో ఒక్క కొవిషీల్డ్ డోసుల నిల్వలు నిండుకున్నాయి. కేంద్రం నుంచి కొత్త డోసులు అందుబాటులోకి రాకపోతే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

  • అక్కాచెల్లెల్లతో కళకళలాడుతోన్న 'రాఖీ' దుకాణాలు

అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతికైన రాఖీ పండగ రేపు కావడంతో.. హైదరాబాద్‌లోని రాఖీ దుకాణాలు మహిళలతో సందడిగా మారాయి. రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలతో బేగంబజార్‌ దుకాణాలు కళకళలాడుతున్నాయి. అన్నా చెల్లి, అక్క తమ్ముళ్ల మధ్య బంధాన్ని పెంచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

  • భద్రాద్రి వద్ద 52 అడుగుల నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి నీటిమట్టం 52 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గరైంది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి 3 రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  • 'ఎన్నికల్లో ఉచితాల'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

ఎన్నికల్లో ఉచిత హామీలు నెరవేర్చలేకపోతే పార్టీల గుర్తింపు రద్దు చేస్తామనడం తగదని.. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అవుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాలపై పార్టీల మేనిఫెస్టో వివరాలను కోర్టుకు అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది.

  • దర్జాగా పడుకొని ఫ్లైట్​లో సిగరెట్ స్మోకింగ్..

స్పైస్‌ జెట్‌ విమానంలో సీట్లపై పడుకొని దర్జాగా సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దుబాయ్​ నుంచి దిల్లీకి వచ్చే విమానంలో ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్‌కు చెందిన బల్విందర్‌ కటారియా అనే వ్యక్తి ఇలా చేశాడు. అయితే అతడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

  • 'క్లౌడ్​ బరస్ట్​' బీభత్సం.. పోటెత్తిన వరద.. విరిగిపడ్డ కొండచరియలు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరద సంభవించింది. కొండ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరద పోటెత్తి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.

  • పశువుల అక్రమ రవాణా.. టీఎంసీ బాహుబలి అరెస్టు..

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుడు, బీర్​భూం జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబత్రా మండల్​ను గురువారం సీబీఐ అరెస్టు చేసింది. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా బోల్‌పుర్‌లోని ఆయన నివాసంలో అనుబ్రతను అదుపులోకి తీసుకుంది.

  • బాలయ్య-అనిల్​రావిపూడి మూవీ అప్డేట్​​ వచ్చేసిందోచ్​..గ్లింప్స్​ అదిరింది

నందమూరి బాలకృష్ణ నటించనున్న 108వ సినిమా ఇప్పటికే ఖరారైంది. దీనికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం గురించి తాజాగా తొలి అప్డేట్ ఇచ్చారు మేకర్స్​.​ ఓ స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్​ చేస్తూ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.