ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 6, 2022, 6:58 PM IST

  • 'డ్యాన్స్ చేస్తే జీఎస్టీ అంట.. గాలి మీద తప్ప అన్నింటిపై పన్ను'

కేంద్రం వివిధ వస్తువులపై పెంచిన జీఎస్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆఖరికి డ్యాన్స్‌ చేస్తే కూడా జీఎస్టీ ఏంటండీ అని ప్రశ్నించారు. కనీసం పాలపైననైనా జీఎస్టీని ఎత్తివేయాలని ప్రధానిని కోరారు.

  • నీతిఆయోగ్‌లో పల్లికాయలు బుక్కుడు తప్ప.. చేసేదేం లేదు: కేసీఆర్‌

కేంద్రం అవలంభిస్తోన్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలీలో మండిపడ్డారు. నీతిఆయోగ్‌ సమావేశాలతో.. ఎవరికీ ఉపయోగం ఉండదన్న సీఎం కేసీఆర్... ఆ భేటీల్లో పల్లికాయలు తింటూ కుర్చోవడం తప్ప చేసేదేం లేదని ఎద్దేవా చేశారు.

  • గుడ్‌న్యూస్... త్వరలో కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

  • అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లిన బస్సు

యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఎస్ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • ప్రేమ జంటల వరస ఆత్మహత్యలు..కారణమేంటీ ?

ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రేమ జంటల వరస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో వరుసగా రెండు రోజుల్లో రెండు ప్రేమజంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. ఏం జరిగిందంటే..?

  • 'తెరాసలో కొనసాగాలా.. రాజీనామా చేయాలా... రేపు స్పష్టత ఇస్తా'

పార్టీను వీడుతానని సంకేతాలు ఇచ్చిన వరంగల్ తెరాస నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మరింత స్పష్టత ఇచ్చారు.రేపు మధ్యాహ్నం వరకు తెరాసలో కొనసాగేది.. రాజీనామా చేసే దానిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • రెండు బైక్​లను బలంగా ఢీకొట్టిన స్కార్పియా.. బంపర్​లో బైకర్​ ఇరుక్కుని..

మహారాష్ట్రలోని కార్వే గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న ఓ స్కార్పియో​.. రెండు బైక్​లను బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ బైకర్​.. ద్విచక్రవాహనంతో పాటు స్కార్పియో బంపర్‌ కింద ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

  • పార్లర్​లో యువతిపై గ్యాంగ్​రేప్​..

బ్యూటీపార్లర్​లో పనిచేస్తున్న ఓ యువతిపై పార్లర్​ మేనేజర్​తో పాటు కస్టమర్​ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, మహారాష్ట్రలో ఓ 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డు మీద పడేసి పారిపోయారు.

  • కామన్వెల్త్​ క్రికెట్​ ఫైనల్లో భారత్​ మహిళా జట్టు.. పతకం ఖాయం

కామన్​వెల్త్​ క్రీడల్లో భారత మహిళా క్రికెట్​ జట్టు అదరగొట్టింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్​పై అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో గెలిస్తే పసిడి, ఓడితే రజతం దక్కుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ విజేతతో ఫైనల్లో భారత్​ తలపడుతుంది.

  • అనుష్క పోషించిన ఆ పాత్ర చేయాలని ఉంది: కృతిశెట్టి

తన డ్రీమ్​ రోల్​ ఎంటో చెప్పింది యువ హీరోయిన్​ కృతిశెట్టి. హీరో నితిన్​పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది. అలానే ఆయనతో కలిసి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గురించి పలు విశేషాలను తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.