- ఖమ్మంలో మంత్రులు..
మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్, ప్రశాంత్‌రెడ్డి.. ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం చేరుకున్నారు. ఐటీ హబ్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వరదసాయం కోసం మీ-సేవ కేంద్రాలకు రావొద్దు
హైదరాబాద్‌లో వరద బాధితులెవరూ మీ-సేవ కేంద్రాలకు రావల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 7 నుంచి వరద సాయం అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ కరోనా అప్డేట్
రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,73,858కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 32,981 కరోనా కేసులు
భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా 32,981 మందికి కరోనా సోకింది. మరో 391 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆమెను ఎంతగానో ఆదరిస్తున్నారు
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని ఆమె. ఓ సైనికుడిని కాపాడి కేరళ కోడలిగా అడుగుపెట్టింది. ఇప్పుడు.. అదే కేరళ నుంచి రాజకీయాల్లోకి వస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తన కథ తెలిసిన కేరళ వాసులంతా ఆమెను ఎంతగానో ఆదరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నలుగురు దుర్మరణం
రాజస్థాన్ బిల్వాడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లి వస్తున్న వ్యాన్‌ను ట్రాలీ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదికి కరోనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గులియానీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లాభాల్లో స్టాక్ మార్కెట్లు
టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజీపై పెరుగుతున్న అంచనాలు, కొవిడ్ వ్యాక్సిన్ ఆశల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోహ్లీ స్థానంలో అతడే సరైనోడు
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు(చివరి మూడు మ్యాచులు) దూరమవ్వబోతున్న టీమ్ఇండియా సారథి కోహ్లీ స్థానంలో శుభమన్ గిల్‌ను తీసుకోవాలన్నాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. అలాగే టెస్టుల్లో ఓపెనింగ్ జోడీలో మార్పులు జరగాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గుర్తుందా శీతాకాలం'
నటుడు సత్యదేవ్, హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'గుర్తుందా శీతాకాలం' సినిమా ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.