ETV Bharat / city

9PM తెలంగాణ టాప్ న్యూస్

author img

By

Published : Aug 12, 2022, 8:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

  • ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల

ఎంసెట్ ఫలితాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ కూడా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈసారి మూడు విడతల్లో ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు తెలిపింది. మొదటి విడత కోసం ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించింది.

  • రాఖీ సంబురం.. ఇంటింటా వెల్లివిరిసిన అనుబంధాల వేడుక..

రాష్ట్రంలో రాఖీ పండుగ సంబురాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఇంటింటా.. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు.. ఇలా అనుబంధాల వేడుక వెల్లివిరుస్తోంది. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకుల ఇళ్లల్లోనూ.. రక్షాబంధన వేడుకలు ఘనంగా జరిగాయి.

  • మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక కోసం పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఈనెల 20న భారీ బహిరంగసభ నిర్వహించ తలపెట్టిన తెరాస ఆమేరకు సన్నాహాలను ముమ్మరం చేసింది.

  • రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కాంగ్రెస్​ పార్టీలో ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో మొదలైన కాక ఇప్పుడు ఆయన సోదరుడు వెంకట్​రెడ్డికి తగులుతోంది.

  • కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు లేఖలు

గాలేరు నగరి నుంచి హంద్రీ నీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేయడం తగదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

  • పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కేంద్రం అలర్ట్.. ప్రజలు గుమిగూడొద్దంటూ..

భారత్​లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్ నియమాలను పాటించాలని ప్రజలను కోరింది.

  • దేశభక్తి గీతాలు పాడిన కోటి 21 లక్షల మంది..

రాజస్థాన్‌లో విద్యార్థులు ప్రపంచ రికార్డును సాధించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారంలో కోటి 21లక్షల మంది విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ను నెలకొల్పారు. రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • ప్రపంచం అంతా ఓవైపు.. టీమ్​ఇండియా మరోవైపు..

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. ఇండియా వర్సెస్​ రెస్ట్ ఆఫ్​ ది వరల్డ్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఈ మ్యాచ్​ జరగనుంది. ఇండియాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెప్టెన్​కు వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​​ వేదికగా ఈ మ్యాచ్​ను బీసీసీఐ నిర్వహిస్తోంది.

  • 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష..

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది.

  • సోషల్​మీడియాలో దిల్​రాజు హల్​చల్​​.. ఏకంగా 36 వేల ట్వీట్లతో

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేరు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. 'దిల్‌ రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. ఉన్నట్టుండి దిల్‌ రాజు పేరు నెట్టింట వైరల్‌ కావడానికి కారణమేమిటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.