- ఘోర రోడ్డు ప్రమాదం..
కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్నలారీని వేగంగా ఢీకొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆర్టీసీ బస్సు బోల్తా
కామారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెక్రియల్ బైపాస్ రహదారిపై మహారాష్ట్ర బస్సు బోల్తా పడి 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో... బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కుప్పకూలిన రైల్వే వంతెన..
అసోం గువాహటిలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రోడ్డేస్తేనే.. ఓటేస్తాం
బంగాల్‌లోని ఓ గ్రామంలో టీ గార్డెన్ కార్మికులు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని అంటున్నారు. తమ డిమాండ్ నెరవేర్చితేనే ఓటు హక్కు వినియోగించుకుంటామని తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేశారు. ఇంతకీ వారి డిమాండ్ ఏంటి..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సగం ఛాయిస్..
పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ తీపికబురు చెప్పింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడటం, ఆన్లైన్ తరగతులకు కొంత మంది విద్యార్థులు హాజరుకాకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఛాయిస్ 50 శాతానికి పెంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ప్రాణాలు తోడేస్తున్నారు!
రోదసిలోకి దూసుకుపోగలడేమో గాని, మనిషి సొంతంగా నీటిని సృష్టించలేడు. తిండీతిప్పలు లేకపోయినా కొన్ని వారాలపాటు నెట్టుకురాగల మానవుడు, గుక్కెడు గంగ లేకుండా ఎన్నాళ్లో బతకలేడు. ఒక్క ముక్కలో, నీరు మనిషికి ప్రాణాధారం. అలాంటి నీటిని ఇష్టంవచ్చినట్టు తోడేసి వాడేస్తున్న మానవాళికి సమీప భవిష్యత్‌లో నీటి కరవు ప్రమాదం పొంచి ఉందన్న నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'భూతాపానికి' కళ్లెం
అంతకంతకూ పెరుగుతున్న శిలాజ ఇంధన వినియోగం భూతాపానికి కారణమవుతోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సమన్వయలోపం కారణంగా ఉద్గారాల తగ్గింపుకు ముందడుగు పడట్లేదు. ఏళ్లు గడుస్తున్నా.. పారిస్ ఒప్పందానికి అంతర్జాతీయ వేదికకు పూర్తి స్థాయిలో చేయూతను అందించేందుకు అగ్రదేశాలు ముందుకు రావట్లేదు. ఫలితంగా వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలపై పోరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆగని పెట్రో మంట..
దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల వరుసగా ఆరో రోజూ కొనసాగింది. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రోహిత్ పొరపాటు
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ అనంతరం రోహిత్, రహానెలు.. మైక్రోఫోన్లో మాట్లాడారు. సరదాగా సాగిన ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పంచుకుంది. ఇందులో రెండో రోజు ఆటపై మాట్లాడిన రోహిత్.. తదుపరి బ్యాంటింగ్ చేసేది బుమ్రా అన్నాడు. కానీ జట్టులో బుమ్రా లేకపోవడం అసలు విషయం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చందమామ ప్రేమకథ
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన ప్రేమకథ గురించి చెప్పింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఫోన్ నంబర్ కోసం వెతుకులాట నుంచి పెళ్లి పీటల వరకు సాగిన తమ ప్రేమ ప్రయాణాన్ని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి