- 1. అందుకే..ఆ 8 మంది బదిలీ!
కర్ణాటకలో ఎనిమిది మంది క్రైమ్ బ్రాంచ్ పోలీసులను బదిలీ చేశారు. బదిలీలు సాధారణమే అనుకుంటే పొరబడినట్లే.. వారంతా నిందితులతో కలిసి విందులో పాల్గొన్న కారణంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 2.ముగ్గురు మహిళలను ఢీకొట్టిన బైకర్
మద్యం మత్తులో బైక్‌పై అతివేగంతో దూసుకెళ్లిన ఓ వ్యక్తి... ఉద్యోగం ముగించుకొని ఇంటికి తిరిగివెళ్తోన్న ముగ్గురు మహిళలను ఢీ కొట్టాడు. ఈ దుర్ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 3. రామునికి విరాళం
అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి ముస్లింలు రూ.5 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లిం సేవాసంస్థలు చెక్కును అందించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 4. శశికళ డిశ్చార్జ్
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బెంగళూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శశికళ డిశ్చార్జ్ సందర్భంగా ఆసుపత్రికి అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 5. భార్యను చంపి..
నల్గొండ జిల్లా బుద్దారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 6. కిచెన్ క్వీన్..
చేతులు కాలాలి.. చెమట చిందాలి.. కళ్లు మండాలి.. బ్రహ్మచారుల గదుల్లో ఒక్క కూర పొయ్యి దిగాలంటే ఇలాంటివెన్నో జరగాలి. వంటగదుల్లో బ్రహ్మచారులు ప్రతిరోజూ పడే పాట్లివి. తీరా వండాక ఉప్పెక్కువో.. కారం తక్కువో.. ఇలా ఏదో ఓ సమస్య. వీటన్నింటికీ పరిష్కారంగా ‘కిచెన్ క్వీన్’ పేరిట ఓ యంత్రం ఆవిష్కరించింది...ఓ యువతి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 7. యూకే కొత్త డీల్!
తమ దేశ ప్రజలకు కొత్త అవకాశాలిచ్చే భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్. మరో కొత్త వాణిజ్య కూటమిలో చేరేందుకు సమాయత్తమవుతోంది.'కాంప్రిహెన్సివ్ అండ్ ప్రొగ్రెసివ్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ (సీపీటీపీపీ)'లో చేరేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 8. కొవిడ్ మూలాలపై పరిశోధన
చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం.. వుహాన్‌లోని మాంసాహార మార్కెట్‌ను ఆదివారం సందర్శించింది. వారితో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 9. గంగూలీ డిశ్చార్జి
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఛాతీలో స్వల్ప అస్వస్థతతో రెండో సారి ఆసుపత్రిలో చేరిన అతనికి మరో రెండు స్టెంట్లు వేశారు వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 10. రావణుడిగా హృతిక్!
బాలీవుడ్లో 3డీలో రామాయణం సినిమాను తెరకెక్కించున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రావణుడిగా హృతిక్.. సీత పాత్రలో దీపికా పదుకొణె నటించనున్నారని సమాచారం. రాముడు పాత్రలో ఎవరు కనిపిస్తారో స్పష్టత లేదు. ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..