ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top news టాప్ న్యూస్ 9PM
Telangana Top news టాప్ న్యూస్ 9PM
author img

By

Published : Aug 19, 2022, 9:20 PM IST

Updated : Aug 19, 2022, 9:35 PM IST

రామంతాపూర్​లోని ప్రైవేటు కళాశాల ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఆపొద్దని కళాశాలలను ఆదేశించింది.

  • రాష్ట్రవ్యాప్తంగా సందడిగా కృష్ణాష్టమి వేడుకలు..

krishnashtami 2022 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి పూజలు చేశారు. పాఠశాలలకు రాధాకృష్ణుల వేషధారణలో వచ్చిన చిన్నారులు నృత్యాలు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలతో అలరించారు.

  • పంచదార కర్మాగారంలో భారీ పేలుడు

Blast at industry in Kakinada ఏపీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం సంభవిస్తునే ఉంది. మొన్న విశాఖపట్టణం, ఆ తరవాత తిరుపతి నేడు కాకినాడ ప్రాంతంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఇవాళ్టి ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 8మంది గాయపడ్డారు.

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియాను ఈడీ అధికారులు కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ దాడులపై ఆప్, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

  • అమెరికా వీసా కావాలంటే ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే..

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. పర్యటక వీసా కావాలంటే దాదాపు ఏడాదిన్నరకుపైగా వేచి ఉండాలి. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విభాగం దరఖాస్తులకు 2024 మార్చి లేదా ఏప్రిల్‌లోనే వీసా అపాయింట్‌మెంట్‌ లభించే అవకాశం ఉంది. స్టూడెంట్‌ వీసా కోసం దాదాపు 470 రోజులు, ఇతర నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసమైతే ఆరున్నర నెలలు వేచిచూడాలి.

  • ఆరోగ్య బీమా పాలసీలు ఒకటికి మించి ఉంటే క్లెయిం చేసుకోవడం ఎలా..

రోజురోజుకూ పెరుగుతున్న అనారోగ్య సమస్యల దృష్ట్యా వైద్యం కోసం చేసే ఖర్చు అధికమవుతుంది. వీటి కోసం మనం ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటాం. ఖర్చు అధికంగా ఉన్నప్పుడు కొందరు అదనపు రక్షణ బీమా తీసుకుంటారు. దాన్ని ఎలా క్లెయిం చేసుకోవాలో తెలియక చాలా మంది సతమతం అవుతుంటారు. ఈ రెండవ బీమాను ఎలా క్లెయిం చేసుకోవాలో తెలుసుకుందాం.

  • గంగూలీని టార్గెట్​ చేశానన్న షోయబ్​, అసలేం జరిగింది​..

భారత మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​, పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​ తమ క్రికెట్​ కెరీర్​లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తాజాగా ఓ క్రీడా ఛానల్ 'ఫ్రెనిమీస్​' పేరుతో క్రికెట్​ దిగ్గజాలతో చేసిన ఇంటర్వ్యూలో హోస్ట్​గా వ్యవహరించిన షోయబ్​, తన తోటి క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్​తో ముచ్చటించాడు.

  • ఆ కష్టాలు తలుచుకుని ఏడ్చేసిన ఛార్మి, విజయ్​కు థ్యాంక్యూ

కొవిడ్​, లాక్​డౌన్​ పరిణామాల అనంతరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు ఛార్మి. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న లైగర్​.. ఈనెల 25 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్​తో ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెపుతూ ఏడ్చింది. ''2019 ఆగస్టు నెలలోనే నేను, పూరి మిమ్మల్ని కలిసి కథ చెప్పాం.

  • మళ్లీ అప్పు చేస్తోన్న తెలంగాణ

Ts government debt తెలంగాణ ప్రభుత్వం గతవారం వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకుంది. ఇప్పుడు మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది.

  • ఆ అంశాలపై ఈనెల 23న కేఆర్‌ఎంబీ కమిటీలు భేటీ..

KRMB committees meeting ఈ నెల 23న కేఆర్‌ఎంబీ కమిటీలు సమావేశం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలతో పాటు జల విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్, వరద జలాల అంశాలపై భేటీ అవనున్నాయి.

  • రామంతాపూర్​ ప్రైవేట్ కళాశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..

రామంతాపూర్​లోని ప్రైవేటు కళాశాల ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఆపొద్దని కళాశాలలను ఆదేశించింది.

  • రాష్ట్రవ్యాప్తంగా సందడిగా కృష్ణాష్టమి వేడుకలు..

krishnashtami 2022 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి పూజలు చేశారు. పాఠశాలలకు రాధాకృష్ణుల వేషధారణలో వచ్చిన చిన్నారులు నృత్యాలు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలతో అలరించారు.

  • పంచదార కర్మాగారంలో భారీ పేలుడు

Blast at industry in Kakinada ఏపీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం సంభవిస్తునే ఉంది. మొన్న విశాఖపట్టణం, ఆ తరవాత తిరుపతి నేడు కాకినాడ ప్రాంతంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఇవాళ్టి ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 8మంది గాయపడ్డారు.

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియాను ఈడీ అధికారులు కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ దాడులపై ఆప్, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

  • అమెరికా వీసా కావాలంటే ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే..

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. పర్యటక వీసా కావాలంటే దాదాపు ఏడాదిన్నరకుపైగా వేచి ఉండాలి. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విభాగం దరఖాస్తులకు 2024 మార్చి లేదా ఏప్రిల్‌లోనే వీసా అపాయింట్‌మెంట్‌ లభించే అవకాశం ఉంది. స్టూడెంట్‌ వీసా కోసం దాదాపు 470 రోజులు, ఇతర నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసమైతే ఆరున్నర నెలలు వేచిచూడాలి.

  • ఆరోగ్య బీమా పాలసీలు ఒకటికి మించి ఉంటే క్లెయిం చేసుకోవడం ఎలా..

రోజురోజుకూ పెరుగుతున్న అనారోగ్య సమస్యల దృష్ట్యా వైద్యం కోసం చేసే ఖర్చు అధికమవుతుంది. వీటి కోసం మనం ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటాం. ఖర్చు అధికంగా ఉన్నప్పుడు కొందరు అదనపు రక్షణ బీమా తీసుకుంటారు. దాన్ని ఎలా క్లెయిం చేసుకోవాలో తెలియక చాలా మంది సతమతం అవుతుంటారు. ఈ రెండవ బీమాను ఎలా క్లెయిం చేసుకోవాలో తెలుసుకుందాం.

  • గంగూలీని టార్గెట్​ చేశానన్న షోయబ్​, అసలేం జరిగింది​..

భారత మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​, పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​ తమ క్రికెట్​ కెరీర్​లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తాజాగా ఓ క్రీడా ఛానల్ 'ఫ్రెనిమీస్​' పేరుతో క్రికెట్​ దిగ్గజాలతో చేసిన ఇంటర్వ్యూలో హోస్ట్​గా వ్యవహరించిన షోయబ్​, తన తోటి క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్​తో ముచ్చటించాడు.

  • ఆ కష్టాలు తలుచుకుని ఏడ్చేసిన ఛార్మి, విజయ్​కు థ్యాంక్యూ

కొవిడ్​, లాక్​డౌన్​ పరిణామాల అనంతరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు ఛార్మి. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న లైగర్​.. ఈనెల 25 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్​తో ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెపుతూ ఏడ్చింది. ''2019 ఆగస్టు నెలలోనే నేను, పూరి మిమ్మల్ని కలిసి కథ చెప్పాం.

Last Updated : Aug 19, 2022, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.