ETV Bharat / city

యాసంగిలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ టాప్​ - తెలంగాణలో వరి కొనుగోళ్లలో టాప్

యాసంగిలో దేశవ్యాప్తంగా వరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సాధించిందని ఎఫ్‌సీఐ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించగా... తెలంగాణ వాటానే 52.23 లక్షల టన్నులని పేర్కొంది. ఎఫ్‌సీఐ లక్ష్యంలో సగం కంటే ఎక్కువ తెలంగాణ నుంచే వచ్చినట్లు వెల్లడించింది. ఎఫ్‌సీఐ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రైతులను సీఎం కేసీఆర్ అభినందించారు.

telangana
telangana
author img

By

Published : May 27, 2020, 7:52 PM IST

Updated : May 27, 2020, 8:13 PM IST

భారత ఆహార సంస్థ(ఎఫ్​సీఐ) ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. మే 22 వరకు దేశవ్యాప్తంగా యాసంగికి సంబంధించి 83.01 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా... ఒక్క తెలంగాణలోనే 52.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎఫ్​సీఐ ప్రకటించింది.

తెలంగాణలో ఏడాది మొత్తం మీద 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ... కేవలం ఈ సీజన్​లోనే సగం కంటే ఎక్కువ కొనుగోలు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన అనంతరం తెలంగాణ నుంచి 13 లక్షల టన్నుల బియ్యాన్ని కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ్​ బంగ, ఝార్ఖండ్ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఎఫ్​సీఐ తెలిపింది.

ఎఫ్‌సీఐ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రైతులను సీఎం కేసీఆర్ అభినందించారు.

దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ ఎదగడం గర్వంగా ఉంది. సాగునీటి లభ్యత, ఉచిత విద్యుత్తును రైతులు వినియోగించుకున్నారు. రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారు.

- సీఎం కేసీఆర్

ధాన్యం సేకరణలో అగ్రభాగాన నిలిచినట్లు ఎఫ్‌సీఐ ప్రకటించడం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రైతుల శ్రమ, సీఎం దూరదృష్టి ప్రణాళిక వల్లే అద్భుతం సాధ్యమైందని పేర్కొన్నారు.

  • Proud of #TelanganaFarmers & the vision of Hon’ble CM KCR Garu in achieving this amazing feat 👍

    Food Corporation of India CMD stated today that #Telangana has emerged as the leader in Paddy procurement this season. Out of the 83lakh MT procured, 52.23 lakhMT (63%)from Telangana pic.twitter.com/qxq8y56U84

    — KTR (@KTRTRS) May 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: రేపు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పైవంతెన ప్రారంభోత్సవం

Last Updated : May 27, 2020, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.