ETV Bharat / city

విద్యుత్​ సరఫరాకు ఇబ్బంది ఉండదు: ట్రాన్స్​కో, జెన్​కో - telangana state Transco

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్​ సరఫరాకు అంతరాయం రాకుండా చూసుకుంటామని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ భరోసానిచ్చారు. డిమాండ్​కు సరిపడా విద్యుత్​ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. కంట్రోల్​ రూంల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నామన్నారు.

transco
ట్రాన్స్​కో, జెన్​కో
author img

By

Published : Mar 21, 2020, 6:05 AM IST

Updated : Mar 21, 2020, 7:45 AM IST

కొవిడ్ -19 వ్యాప్తిని ఎదుర్కొనేందుకు విద్యుత్ సంస్థలు పూర్తిగా సన్నద్ధమయ్యాయని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యాలయాలు, రెండు డిస్కంల వద్ద కంట్రోల్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని అన్ని జోనల్, సర్కిల్ హెడ్‌లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

మార్గదర్శకాలు ఖరారు

కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి పవర్ సెక్టార్ అనుసరించాల్సిన వివరణాత్మక సూచనలు, మార్గదర్శకాలను ఖరారు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి, కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలను అమలు చేయడానికి తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్ఎల్డీసీ).. స్టేట్ ఎలక్ట్రిసిటీ కంట్రోల్ సెంటర్ (ఎస్ఇసీసీ) గా పనిచేస్తుంది.

15 రోజుల అవసరాలకు అనుగుణంగా..

జనరేటింగ్ స్టేషన్లు, అన్ని యూనిట్ సైడ్ అత్యవసర పరిస్థితులను.. జాగ్రత్తగా చూసుకోవడానికి చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బొగ్గు, హెచ్‌ఎఫ్‌ఓ, ఎల్‌డీఓ, కెమికల్ స్టాక్స్ వంటి ఇంధన నిల్వలను విద్యుత్ కేంద్రాల్లో కనీసం 15 రోజుల అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

అన్ని కేంద్రాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు, వాషింగ్ సదుపాయాలు కల్పించాలని.. ఉద్యోగులందరూ ముసుగులు ధరించి రావాలని ఆదేశించింది.

ట్రాన్స్​కో, జెన్​కో

ఇవీ చూడండి: కరోనా పరీక్ష​ కిట్ల నాణ్యత తేల్చేందుకు 14 సంస్థలకు లైసెన్స్​

Last Updated : Mar 21, 2020, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.