ETV Bharat / city

వైరల్​:  హోంమంత్రి మనవడి టిక్​టాక్​ వీడియో

టిక్​టాక్​ వీడియోల పట్ల యువత మోజు రోజురోజుకు పెరిగిపోతోంది. వేలం వెర్రిగా మారి ఎక్కడ పడితే అక్కడ టిక్​టాక్​ వీడియోలు చిత్రీకరిస్తున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర హోంమంత్రి మనవడు ఫుర్కాన్​ అహ్మద్​ టిక్​టాక్​ వీడియో వివాదాస్పదంగా మారింది.

author img

By

Published : Jul 18, 2019, 12:03 PM IST

telangana state home minister's grnad son's tiktok video gone viral and become contraversal
వైరల్​: హోంమంత్రి మనవడి టిక్​టాక్​ వీడియో

రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ మనవడు ఫుర్కాన్​ అహ్మద్​ టిక్​టాక్​ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఫుర్కాన్​ తన స్నేహితుడితో కలిసి కింగ్​ నాగార్జున నటించిన డాన్​ సినిమా హిందీ డబ్బింగ్​ డాన్​ నం.1 డైలాగ్​ను చిత్రీకరించారు. హోంమంత్రి వినియోగించే ప్రభుత్వ అధికారిక వాహనంపై కూర్చొని వీడియో చిత్రీకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీడియో తీస్తున్న సమయంలో అధికారిక వాహన డ్రైవర్​ అక్కడే అటువైపు తిరిగి ఉన్నారు. హోంమంత్రి అధికారిక వాహనాన్ని ఇలా టిక్​టాక్​ వీడియో తీయడానికి వినియోగించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలి ఖమ్మం కార్పొరేషన్​ కార్యాలయంలో పొరుగుసేవల సిబ్బంది టిక్​టాక్​ వీడియో చేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో హోంమంత్రి మనవడి వీడియో చర్చనీయాంశంగా మారింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.