అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంతో పునరుత్పాదక ఇంధన వనరులపై తెలంగాణ ప్రభుత్వం సిస్టర్ స్టేట్ పార్టనర్షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పునరుత్పాదక శక్తి స్థిరత్వ ఆవిష్కరణల సదస్సు - 2019 జరిగింది. ఈ సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ ముర్ఫీ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న బృందం, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, న్యూజెర్సీ గవర్నర్ సంతకాలు చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఆయా రంగాల్లో మేలు జరుగుతోందని కేటీఆర్ తెలిపారు.
ఇదీ చదవండిః ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది: కేటీఆర్