ETV Bharat / city

జలసిరులతో ప్రాజెక్టుల తొణికిసలు... నదుల పరవళ్లు...

రాష్ట్రంలోని ప్రాజెక్టులు పరవళ్లుతొక్కుతున్నాయి. ఎగువ నుంచి పోటెత్తున్న వరద వల్ల కృష్ణాతో పాటు గోదావరి బేసిన్​లోని జలాశయాలు.... జలసిరులతో తొణికిసలాడుతున్నాయి. నాగార్జునసాగర్ నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు తీస్తుంటే.... ఎస్సారెస్పీ సహా వివిధ ప్రాజెక్టుల నుంచి గోదారమ్మ ఉరకలెత్తుతోంది.

జలసిరులతో ప్రాజెక్టుల తొణికిసలు... నదుల పరవళ్లు...
జలసిరులతో ప్రాజెక్టుల తొణికిసలు... నదుల పరవళ్లు...
author img

By

Published : Sep 19, 2020, 8:22 PM IST

కృష్ణమ్మ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. జూరాలకు 2లక్షల 3వేల ప్రవాహం వచ్చిచేరుతుండగా.... 2లక్షల 13వేల 913క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక్కడి నుంచి తుంగభద్ర నదీ సంగమంతో... శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి 3 లక్షల 98వేల 980 క్యూసెక్కులు వస్తుండగా.... 4లక్షల 3వేల 937 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌వైపుగా పరుగులుతీస్తోంది. శ్రీశైలం పూర్తినీటిమట్టం.... 885అడుగులు కాగా.... ప్రస్తుతం 884.50 అడుగుల మేర కొనసాగుతోంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215.81టీఎంసీలకు గాను.... 212.92టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సాగర్​ సోయగం...

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 3లక్షల 77వేల 594 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా... అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం నీటి నిల్వ 311.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.... 589.80 అడుగుల మేర నీటిమట్టం కొనసాగిస్తున్నారు.

నిండుకుండలా శ్రీరాంసాగర్...​

గోదావరికి సైతం భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే నిండుకుండలా మారిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరద జలాలు దిగువకు పరుగులు తీస్తున్నాయి. ప్రాజెక్టుకు 96వేల 874 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంటే అంతే మొత్తంలో... కిందికి విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.... ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులు మేర కొనసాగిస్తున్నారు. శ్రీరాంసాగర్ పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను..... ప్రస్తుతం 83.77 టీఎంసీలు నీటి నిల్వ కొనసాగుతోంది.

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద...

ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురం భీం, వట్టి వాగు ప్రాజెక్టులలోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. కుమురం భీం ప్రాజెక్టు మూడు గేట్లు, వట్టి వాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.