ETV Bharat / city

బల్దియా పోలీసులకు లేరు పోటీ... శాంతిభద్రతలో వాళ్లకు వాళ్లే సాటీ - తెలంగాణలో తగ్గిన క్రైం రేటు

ప్రపంచంలో ఏ ప్రాంతమైనా సురక్షితంగా ఉండాలన్నా... అభివృద్ధి చెందాలన్నా... శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే సాధ్యం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిందితుల వేటలో వేగం.. మహిళల భత్రతకు ప్రత్యేక వ్యవస్థతో.... రాష్ట్ర పోలీసులను దేశంలోనే నంబర్​ వన్​గా చేశాయి. ఆరేళ్లలో శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా... పోలీసు శాఖ మరింత కృషిచేస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాలను అరికడుతోంది.

telangana policing is very better than other states

author img

By

Published : Nov 20, 2020, 9:04 AM IST

రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి. నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖకు నిధులు కేటాయించడంతో పాటు నూతన భవనాలను సర్కారు సమకూర్చింది. ముఖ్యంగా రాజధాని భాగ్యనగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సాంకేతికతను అభివృద్ది చేసింది. ఆధునిక పద్ధతుల ద్వారా నేర నిర్ధరణ, సాక్ష్యాల సేకరణ, నేరం జరగకుండా వివిధ శిక్షణ కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. కోట్ల రూపాలయలతో అధునాతన వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. అంతే కాకుండా శాఖలో అవినీతికి తావు లేకుండా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్​పై దృష్టి సారించారు.

పోస్తుల భర్తీ... పటిష్ట గస్తీ...

మట్కా జూదం, పేకాట తదితర సామాజిక రుగ్మతలను ఉక్కుపాదంతో అణచివేయడానికి పోలీస్‌ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్‌ శాఖలో పోస్టులను భర్తీ చేసింది. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేయడం ద్వారా దొంగతనాలు, దోపిడీలను అరికట్టగలిగారు. డయల్ 100 ని మరింత పటిష్టం చేశారు.

మొబైల్​ యాప్స్​తో...

పోలీస్‌ స్టేషన్​కు వెళ్లాలంటే భయపడే పరిస్థితుల నుంచి స్నేహ పూర్వక వాతావరణాన్ని ఠాణాల్లో అభివృద్ది చేశారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు పడేలా చూస్తున్నారు. కొన్నేళ్లుగా నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌ అంతర్గత ఉపయోగం కోసం ఒక మొబైల్‌ ఆధారిత అప్లికేషన్‌ను ప్రారంభించడం వల్ల ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ శాఖలో ఉపయోగించే అన్ని ఐటీ అప్లికేషన్లు, డేటాబేస్‌ ఈ యాప్‌కు అనుసంధానం చేశారు. నేరం జరిగిన ప్రాంతం నుంచి సమాచారం, దృశ్యాలు యాప్​లో అప్లోడ్‌ చేయడం ద్వారా ఆన్​లైన్‌ విశ్లేషణాత్మక నివేదికలు పొందవచ్చు. హాక్​ఐ అప్లికేషన్​ ద్వారా ఫిర్యాదులు, అనుమానిత వాహనాల వివారనతో పాటు తదితర అంశాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూశారు. మహిళలు ప్రయాణించే వాహనం యొక్క ఫొటోను లేదా రికార్డు వీడియోను క్లిక్‌ చేసి, అప్​లోడ్‌ చేసినట్లయితే అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం పోలీసులను సంప్రదించడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

ఫింగర్​ప్రింట్లు... పేస్​ రికగ్నేజేషన్లు...

హైదరాబాద్‌ ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్‌... నగరంలో ఎలక్ట్రానిక్‌ లైవ్‌ స్కాన్‌ పరికరాన్ని ఆవిష్కరించింది. దీన్ని ఉపయోగించి నిందితుల ముద్రలు సులువుగా పరిశీలించవచ్చు. ఈ వ్యవస్థ నేరాల దర్యాప్తు రంగంలో తీవ్ర మార్పు తెచ్చింది. ఎవరైనా అనుమాన్పదంగా తిరుగుతుంటే వారి ఫింగర్ ప్రింట్ ద్వారా నేర చరిత్ర తెలుసుకుంటున్నారు. దీంతో పాటు తప్పిపోయిన వారిని కొన్నేళ్లైనా గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నిక్​ను అందుబాటులోకి తెచ్చింది. నేరాలు చేసి తప్పించుకుని తిరిగేవారిని మొబైల్ సిగ్నల్ ఆధారంగా గుర్తించేందుకు సెల్ సిగ్నల్ ఎసెస్మెంట్ టీమ్​లు ఏర్పాటు చేసి పట్టుకుంటున్నారు.

సైబర్​ నేరాలపై ఫోకస్​...

నగరంలో నేరాలు తగ్గాయి కానీ... సైబర్ నేరాలు ప్రతి ఏడాది పెరుగతూనే ఉన్నాయి. ఓఎలెక్స్, ఓటీపీ, క్యూఆర్ కోడ్, గిఫ్ట్​ ఫ్రాడ్​ వంటి సైబర్ నేరాలు తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను చాకచక్యంతో అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడే జాంతార గ్యాంగ్ వంటి కరుడు గట్టిన ముఠాలను కూడా పట్టుకుంటున్నారు. నగరంలో జరిగే ప్రతి ఒక్క నేరాల తీరు ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ స్మార్ట్ పోలీసింగ్ ను అవలంబిస్తున్నారు. అధిక వడ్డీలు ఇస్తామంటూ తెరపైకి వచ్చిన మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలను అరికట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారిస్తున్నారు. ప్రజలను చైతన్య పరిచి సీసీ కెమెరాల సంఖ్య పెంచడం వల్ల చాలా నేరాలను అదుపులోకి తెచ్చారు. గొలుసు దొంగతనాలను పూర్తి స్థాయిలో అరికట్టగలిగారు.

వరుస నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టులు ప్రయోగించి భవిష్యత్తులో తిరిగి దొంగతనాలకు పాల్పడకుండా శిక్షలు విధిస్తున్నారు. నగరం ఇటీవల జరగిన అపహరణలను గంటల వ్యవధిలో ఛేదించారు. ప్రజల సహకారంతో ఘటనపై వివరాలు తెలుసుకుని వాటిని ముందస్తుగా అరికడుతున్నారు.

ఇదీ చూడండి: బల్దియాలో డిజిటల్ ప్రచారం.. సోషల్ వారియర్స్ దూకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.