ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ముత్యాల గ్రామ శివారులో రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ భూభాగం నుంచి ప్రాజెక్టు పరిశీలనకు ఉదయభాను వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ భూభాగం నుంచి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు.
అడ్డుకున్న ప్రదేశంలోనే నిరసన తెలిపిన ఉదయభాను... తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణా డెల్టా రైతుల అవసరాల కోసమే పులిచింతల నిర్మాణమైందని ఆయన గుర్తుచేశారు. రైతులను కాదని తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రైతుల హక్కులను తెరాస ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: RAIN EFFECT: భద్రాద్రి జిల్లాలో భారీవర్షాలు.. నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి