జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా దృఢసంకల్పంతో పోరాడి ప్రజల మనసులను గెలుచుకుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఆ పార్టీ అధినాయకత్వానికి, తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న బండి సంజయ్‌కి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మణ్‌కి, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
‘భాజపా సాధించిన 48 స్థానాలు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేదానికి బలమైన సంకేతం. భవిష్యత్తులోనూ భాజపాతో పార్టీతో కలిసి తెలంగాణలో కూడా పనిచేస్తాం’ అని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన నుంచి 40-50 మంది సిద్ధంగా ఉన్నా.. తన మాటతో ఆగిపోయారని ఆయన చెప్పారు. నెల్లూరులో శుక్రవారం రాత్రి పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు. జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. తాను బతికున్నంత వరకు జగన్ సీఎంగా ఉంటారని అంటున్నారని, జనసైనికుల కష్టాన్ని గుర్తించి ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని చెప్పారు.
ఇవీ చూడండి: తెలంగాణలో భాజపా విస్తరణ... ఇదే షా వ్యూహం...!