సహకార ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. రేపు నామపత్రాల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు పదో తేదీతో గడువు ముగుస్తుంది. ఈ నెల 15 న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 13 చొప్పున డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పీఏసీఎస్ ఛైర్మన్లను పరోక్ష పద్ధతిన ఎన్నుకుంటారు.
రాష్ట్రంలోని 905 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ అయింది. ఇవాళ నామినేషన్ చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు.