తాను ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే వ్యక్తిని కానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలనే నమ్ముకున్నానని తెలిపారు. తప్పుడు ఆరోపణలతో తనను బయటకు పంపారన్న ఈటల.. ప్రలోభాలకు లొంగలేదనే నిందలు వేశారని చెప్పారు.
తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆత్మగౌరవ పోరాటం ప్రారంభమైందని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన తెలంగాణ ఎన్ఆర్ఐలతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కష్టకాలంలో తన వెంట నడుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.