ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM - Telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana news in telugu
టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM
author img

By

Published : Jun 24, 2021, 5:13 PM IST

Updated : Jun 24, 2021, 5:38 PM IST

--

తేలికపాటి వర్షాలు

తెలంగాణలో నాలుగైదు రోజులు తేలికపోటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

గెలిచేది భాజపానే

హుజూరాబాద్​ ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేది భారతీయ జనతా పార్టీనే అని ఈటల రాజేందర్​ వెల్లడించారు. రాష్ట్రంలో అణచివేత ధోరణికి చరమగీతం పాడాలని హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డెల్టా ప్లస్ వేరియంట్‌

రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్‌ వైరస్‌ వెలుగు చూడలేదని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 97 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వెల్లడించారు. ఇందులో 83 లక్షలమంది మెుదటి డోసు వారు ఉన్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మెరుగైన ఉచిత వైద్యం

పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ అన్నారు. హైదరాబాద్​లోని ఎర్రగడ్డ చెస్ట్​ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్నప్రభుత్వ నిర్ణయంతో ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రక్షాళన కోసం

గంగానది ప్రక్షాళన కోసం 5,900 కిలోమీటర్లు కాలినడక కార్యక్రమం చేపట్టింది అతుల్య గంగ మిషన్​ బృందం. ప్రజలకు గంగానది సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పేడకుప్పలో నవజాత శిశువు

అత్యాచారానికి గురై గర్భవతిగా మారిన ఓ బాలిక తనకు పుట్టిన నవజాత శిశువును పేడకుప్పలో వదిలేసి వెళ్లింది. ఈ అమానవీయ ఘటన హిమాచల్​ప్రదేశ్​లో జరిగింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ శిశువుని స్థానికుడు ఒకరు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పసడి ధర..

పసడి ధర గురువారం కాస్త తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.46,283కు చేరింది. కిలో వెండి..రూ.66,789 వద్ద ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అనుమానాస్పద మృతి

తొలి యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త , 75 ఏళ్ల అమెరికా పౌరుడు జాన్‌ మేకఫీ స్పెయిన్‌లోని జైలులో అనుమానాస్పదంగా మృతిచెందారు. పన్ను ఎగవేత కేసులో మేకఫీని అమెరికాకు అప్పగించడానికి స్పెయిన్‌లోని ఓ కోర్టు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన మరణించారు. మేకఫీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని... జైలు అధికారులు తెలిపారు. . పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరు వ్యాపారాలకు మద్దతు..

విలక్షణ నటుడు సోనూసూద్​(Sonu Sood).. చిరు వ్యాపారాలకు తన మద్దతును తెలియజేశాడు. సైకిల్​పై తినుబండారాలు అమ్ముతూ.. చిన్న చిన్న వ్యాపారాల(Small Businesses)కు ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో ద్వారా తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రంగం సిద్ధం..

యూఏఈలో మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్​ల నిర్వహణకు ఫ్రాంఛైజీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. క్రికెటర్ల ప్రయాణ, వసతి సౌకర్యాల ఏర్పాటుకు త్వరలోనే ఆ దేశానికి పయనమవనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 24, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.