ETV Bharat / city

డిసెంబరు తొలి వారానికి సచివాలయం సిద్ధం

Telangana New Secretariat Inauguration సచివాలయ పనులు ఇంకా పూర్తికానందున విజయదశమికి పూర్తి అవుతుందనుకున్న నిర్మాణాలు ఇంకా నాలుగు నెలలు ఆలస్యం కావస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి డిసెంబరు మెుదటి వారానికి పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telangana New Secretariat Inauguration
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం
author img

By

Published : Aug 29, 2022, 9:57 AM IST

Telangana New Secretariat Inauguration : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం డిసెంబరు తొలివారానికి సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయదశమికి ప్రారంభించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు నిర్దేశించిన లక్ష్యం కాగా, ఆయన ఇటీవల సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

సచివాలయాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరో మూడున్నర, నాలుగు నెలల సమయ పడుతుందని అధికారులు అంటున్నారు.ఈ పరిస్థితుల్లో పండగ సందర్భంగా గృహప్రవేశ పూజాదికాలను నిర్వహించడమా? లేక నిర్మాణం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేదాకా వేచి ఉండి ధనుర్మాసానికి ముందు ప్రారంభించడమా? అనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జలు పడుతోంది.

New Secretariat Inauguration in Telangana : తొలుత 6 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించినా ప్రస్తుతం అది 8.60 లక్షల చదరపు అడుగులకు చేరింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారు. 2019 జూన్‌లో సచివాలయ నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నమూనాలు సిద్ధమై తొలి స్లాబు వేసేందుకు 2021 జనవరి అయింది. కరోనా కారణంగా నాలుగు నెలల పాటు ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. ఆ తరవాత నుంచి పనుల వేగాన్ని పెంచారు. అన్ని అంతస్తుల్లోనూ పనులు ఒకేసారి జరిగేలా రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రణాళికను రూపొంచడంతో పాటు పనుల తీరు తెన్నులను రోజువారీగా సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది నవంబరు చివరి వారం లేదా డిసెంబరు తొలి వారానికి భవన ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇలా పనులు.. తొలుత వాస్తు కారణాలతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ను మట్టితో నింపాలని నిర్ణయించారు. భవన నిర్వహణకు సంబంధించిన విభాగాల కార్యాలయాలకు ఆ ప్రాంతాన్ని వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతినివ్వడంతో మట్టితో నింపే ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుతం 3అంతస్తుల్లో ఇంటీరియర్‌ పనులు సాగుతున్నాయి. మిగిలిన అంతస్తుల్లోనూ పనులు చేపట్టారు. ప్రాంగణానికి అవసరమైన పవర్‌ హౌస్‌ ఎక్కడ నిర్మించాలన్న అంశంలో సాగిన తర్జనభర్జలు జాప్యానికి ఒక కారణంగా ఉంది.

నెల క్రితమే ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన స్థలాన్ని గుర్తించారు. వెయ్యి నుంచి 1200 కేవీ సబ్‌స్టేషన్ల వరకు అవసరమన్నది అంచనా. సహజ సిద్ధమైన వెలుతురును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా నిర్మాణం ఉన్నా భవనమంతా సెంట్రలైజ్డు ఎయిర్‌ కండీషనర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో విద్యుత్తు వినియోగానికీ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. పచ్చదనంతోపాటు భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఫౌంటెయిన్లకు సంబంధించిన శిలా ప్రతిమలూ సిద్ధమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.