ETV Bharat / city

Shaikpet Flyover Inauguration : పైవంతెన ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నాం: కేటీఆర్

Shaikpet Flyover Inauguration : హైదరాబాద్​ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి మరో పైవంతెన నిర్మాణమయింది. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ షేక్​పెట్ పైవంతెనను ఇవాళ ప్రారంభించనున్నారు. పాత-కొత్త నగరాలను కలిపే ఈ వంతెన ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.

author img

By

Published : Jan 1, 2022, 9:07 AM IST

Shaikpet Flyover Inauguration
Shaikpet Flyover Inauguration

Shaikpet Flyover Inauguration : హైదరాబాద్​ షేక్​పేట్​ పైవంతెనను ఇవాళ.. రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నూతన సంవత్సర బహుమతిగా ఉదయం 11.30 గంటలకు పైవంతెనకు శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో పొడవైన వంతెనల్లో షేక్​పేట్ పైవంతెన ఒకటి. రూ.335 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడలి ఈ నిర్మాణం చేశారు. మొత్తం 2.8 కిలోమీటర్ల పొడవున 6 లైన్లు విస్తరించి ఉంది. ఈ వంతెనతో మెహదీపట్నం-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

  • Starting the new year, by bridging the old with the new

    Extremely happy to inaugurate the 6 lane, 2.71 km long shaikpet flyover connecting Tolichowki to Raidurg built at a cost of ₹333Cr

    Another milestone in our effort to ease traffic in #Hyderabad through GHMC’s #SRDP program pic.twitter.com/KKyIB0X6Xd

    — KTR (@KTRTRS) January 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో మైలురాయి..

KTR Tweet on Shaikpet Flyover : నేడు పాత, కొత్త నగరాలను కలిపే పైవంతెన ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వంతెనను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. టోలిచౌకి నుంచి రాయదుర్గాన్ని కలుపుతూ ఈ వంతెనను నిర్మించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా ఈ వంతెన నిలుస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.