ETV Bharat / city

భాగ్యనగరంలో నిరంతరం నీటి సరఫరాకు ప్రణాళికలు: కేటీఆర్​ - free water supply

తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2050 ఏడాది వరకు హైదరాబాద్ విస్తీర్ణం ఎంత పెరిగినా నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు నిరంతరం నీరు సరఫరా చేసేందుకు కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా నీటిని రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిలో వినియోగించి సంరక్షించుకోవాలని సూచించారు.

free water supply in Hyderabad  free water supply in Hyderabad
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
author img

By

Published : Mar 22, 2021, 11:32 AM IST

తెలంగాణ సర్కార్​ సాగు, తాగు నీటికి ప్రాధాన్యతనిస్తోందని పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. 2050 ఏడాది నాటికి హైదరాబాద్ మహానగర విస్తీర్ణమెంత ఉన్నా.. జనాభా ఎంత పెరిగినా.. అందరికీ సరిపడా నీటిని సరఫరా చేసేందుకు కేశవాపూర్ వద్ద రూ.4,700 కోట్లతో రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు. మరోవైపు సుంఖిశాల నుంచి రూ.1,450 కోట్లతో మరో లైన్ ద్వారా నగరానికి నీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్​లో ప్రజలకు 20వేల లీటర్ల నీరు ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. దీనికోసం ఎంపానల్ ఏజెన్సీల ద్వారా ఇంటింటికి వెళ్లి పథకం గురించి వివరించి మీటర్లు బిగిస్తున్నారని చెప్పారు. ఈ మీటర్లతో దాదాపు 90 శాతం మందికి ఉచితంగా నీరందించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల కుటుంబాలకు 2.29 లక్షల కనెక్షన్లను ఇచ్చినట్లు వివరించారు. ప్రజల సౌకర్యం కోసం మీటర్ల బిగింపు కోసం ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

వేసవి వచ్చినందున ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ మరో చెన్నైగా మారకూడదంటే నీరు వృథా చేయొద్దని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. నీటిని రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిలో వినియోగించి సంరక్షించుకోవాలని సూచించారు.

'భాగ్యనగరంలో నిరంతరం నీటి సరఫరాకు ప్రణాళికలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.