మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. షెడ్యూల్ ప్రకారం యథాతథంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 పురపాలికల్లోని 325 కార్పొరేటర్, 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ముఖ్యమైన తేదీలు
- నామినేషన్ల స్వీకరణ- జనవరి 8 నుంచి 10
- నామినేషన్ల పరిశీలన- జనవరి 11
- నామినేషన్ల ఉపసంహరణ గడువు- జనవరి 14
- పోలింగ్ - జనవరి 22
- ఓట్ల లెక్కింపు- జనవరి 25