ETV Bharat / city

క్యాసినో వ్యవహారంలో ఆ ఎమ్మెల్యేల పాత్ర.. ఈడీ నోటీసులిచ్చే అవకాశం..

Casino Case in Hyderabad: రాష్ట్రంలో సంచలనంగా మారిన క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ అధికారులు.. ఈ కేసులో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతుందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఏజెంట్​ చీకోటి ప్రవీణ్​కు విచారిస్తున్న అధికారులకు అతడి చరవాణీలో పలువురు ఎమ్మెల్యేల నెంబర్లు దొరికాయి.

Telangana MLAs role in Casino case in hyderabad

author img

By

Published : Aug 6, 2022, 8:09 PM IST

Casino Case in Hyderabad: క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీస్తుండగా.. పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి ఏజెంట్ చీకోటి ప్రవీణ్​ను విచారిస్తున్న ఈడీ అధికారులు.. అతడి చరవాణిలో పలు వాట్సాప్ చాటింగ్​లను గుర్తించారు. ఈ మేరకు వాటి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో పలువురు ఎమ్మెల్యేల నెంబర్లను ఈడీ గుర్తించింది. నేపాల్​లో నిర్వహించిన క్యాసినోకు నగదును తీసుకెళ్లిన ప్రవీణ్.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఒకవేళ ఎమ్మెల్యేలకు సంబంధం ఉందని తేలితే మాత్రం.. ఆయా నాయకులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతానికైతే ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు లావాదేవీలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే... ఆ డబ్బును ఏం చేశారనే కోణంలో ఆరా తీస్తారు. డబ్బుతో బంగారం లేదా... స్థిరాస్తులు కొనుగోలు చేస్తే మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, ఆయా ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది. ప్రవీణ్ లాప్​టాప్, చరవాణీలను రామాంతపూర్​లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించి.. డేటా రిట్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు వాట్సాప్ చాటింగ్​లు బయటికి వచ్చాయి. ప్రవీణ్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చాక.. మిగతా అంశాలపై ఈడీ అధికారులు దృష్టి సారించే యోచనలో ఉన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.