ఐటీఐఆర్ రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్ జోన్ ఇవ్వలేదని మండిపడ్డార. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదని వాపోయారు. కేంద్రం హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎవర్ని అడగాలని ప్రశ్నించారు.
ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పనిచేయండి అని మంత్రి కేటీఆర్ సూచించారు. దిగుమతి సుంకాలు పెంచి మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా అని నిలదీశారు. రాష్ట్రం నుంచే అధిక రెవెన్యూ తీసుకుంటూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు. బుల్లెట్ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా అని ప్రశ్నించారు. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 60 ఎకరాలు అడిగితే.. 150 ఎకరాలు ఇచ్చామని అయినా.. దాని ఊసే లేదని కేటీఆర్ అన్నారు.
- ఇదీ చూడండి : వైద్యం అందక పిట్టల్లా రాలుతున్నపసి పిల్లలు