ETV Bharat / city

Harish Rao: 'న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదు' - neutral alcohol under GST

న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రాలు కోరుతున్నట్లు ఆల్కహాల్‌ను జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో అతి‌ తక్కు‌వ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని హరీశ్​ పేర్కొన్నారు.

harish rao
న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదు
author img

By

Published : May 28, 2021, 10:07 PM IST

జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు ఎక్సైజ్, పెట్రోల్, డిజిల్ మాత్రమే వదిలిన నేపథ్యంలో న్యూట్రల్ ఆల్కహాల్​ను జీఎస్టీ (GST) పరిధిలోకి తేవడం సమంజసం కాదని... దానికి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు (Harish Rao) కోరారు. దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన 43వ జీఎస్టీ మండలి సమావేశం (GST Council meet) లో హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి మంత్రి పాల్గొన్నారు.

18 శాతం ఆదాయం..

కేంద్రానికి సెస్, సర్​ఛార్జీల రూపంలో ఎక్కువగా ఆదాయం వస్తోందని హరీశ్​రావు (Harish Rao) తెలిపారు. గత బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం 18 శాతం ఇదే రూపంలో వచ్చిందన్నారు. కేంద్రం వసూలు చేస్తోన్న సెస్​లు, సర్​ఛార్జీల కారణంగా రాష్ట్రాలు 1.64 లక్షల కోట్ల రూపాయలు అంటే 41 శాతం ఆదాయాన్ని కోల్పోతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయి..

తెలంగాణ రాష్ట్రం ఏటా రూ.3,439 కోట్ల అంటే 2.102 శాతం ఆదాయాన్ని కోల్పోతోందన్నారు. న్యూట్రల్ ఆల్కహాల్​ను జీఎస్టీలో‌ చేర్చితే రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయని... అన్ని రాష్ట్రాల మంత్రులు కోరుతున్నట్లు ఆల్కహాల్​ను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఆర్థిక మంత్రి కోరారు. దేశంలో అతి‌ తక్కు‌వ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అన్న ఆయన... 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల ఆదాయంలో ఆర్థిక లోటు 36.3 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉందని వివరించారు.

కరోనా కారణంగా ఖర్చులు పెరిగాయి..

కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని, ఖర్చులు బాగా పెరిగాయని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో తెలంగాణ రాష్ట్రం వెచ్చిస్తోందని హరీశ్​ తెలిపారు. ఈ పరిస్థితుల్లో రుణపరిమితిని మూడు నుంచి ఐదు‌ శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఐజీఎస్టీ నిధులు రూ.13 వేల కోట్లు కన్సాలిటేడెటి ఫండ్​కు ఆదాయం సమకూరిందని... అందులో రాష్ట్రానికి రావాల్సిన రూ.218 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి ఏడాది అన్న హరీశ్​రావు... ఆర్థిక స్థితిగతులు బాగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: 'బ్లాక్​ ఫంగస్​ ఔషధాలకు జీఎస్​టీ మినహాయింపు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.