ETV Bharat / city

కరోనాతో గనుల ఆదాయానికి గండి - telangana mines are at loss due to corona

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆకర్షణీయ ఆదాయాలు సమకూర్చడంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కీలకమైన గనుల రంగం కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోతోంది.  రెండు నెలలుగా దేశవ్యాప్తంగా గనుల తవ్వకాలు నిలిచిపోయాయి. స్టీలు, సిమెంటు పరిశ్రమల్లో ఉత్పత్తి కార్యకలాపాలు మందగించాయి. వినియోగమూ అంతంతే. లాక్‌డౌన్‌ నిబంధలు కొంతమేరకు సడలించినా, డిమాండ్‌ తగినంతగా లేక గనుల్లో ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరలేదు.

telangana mines are in loss due to corona pandemic
కరోనాతో గనుల ఆదాయానికి గండి
author img

By

Published : May 30, 2020, 6:21 AM IST

గనుల రంగం నుంచి పన్నులు, సెస్‌లు, లీజుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం సమకూరుతుంది. లాక్‌డౌన్‌ వల్ల గనుల తవ్వకాలు నిలిచిపోవడం, ఖనిజాల అమ్మకాలు తగ్గడం వల్ల ఈ ఆదాయానికి చాలా మేరకు గండిపడింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల మేరకు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.5,000 కోట్ల వరకు ఆదాయ నష్టం ఉంటుందని కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన కేపీఎంజీ అంచనా వేసింది.

కొన్ని కొత్త బొగ్గు గనులు, ఇతర గనుల వేలం ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వేలం సాధ్యం కాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ఇటీవల కొన్ని ఇనుప ఖనిజం గనులను ప్రభుత్వం వేలం ద్వారా కొన్ని సంస్థలకు కేటాయించింది. ఆయా సంస్థలు తవ్వకాలు ప్రారంభించలేని స్థితిలో ఉన్నాయి. స్టీలు, సిమెంటు, విద్యుత్తు రంగ సంస్థల నుంచి ఇనుప ఖనిజానికి డిమాండ్‌ తగినంతగా కనిపించడం లేదు. గనుల తవ్వకాలు- నిర్వహణ పనులు చేపట్టే సంస్థలకూ ఆదాయ నష్టం అధికంగా ఉంటుంది. అందువల్ల ఆయా సంస్థలు తమ బాకీలను వెంటనే చెల్లించలేకపోవచ్చు. కార్మికుల కొరత ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో గనుల తవ్వకాలు చేపట్టలేని పరిస్థితి ఉంది. గనుల ఆదాయం ఒడిశా, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అధికం.

బొగ్గు వినియోగం తగ్గింది...

కొవిడ్‌- 19 లాక్‌డౌన్‌ వల్ల పారిశ్రామిక కార్యకలాపాలు మందగించి, బొగ్గు వినియోగం తగ్గింది. ఈ ఏడాది మార్చిలోనే బొగ్గు వినియోగం 16 శాతం వ్యతిరేక వృద్ధి నమోదు చేసింది. ఇదే పరిస్థితి మరిన్ని నెలల పాటు కనిపిస్తుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు నెలలుగా పనులు లేక నిర్మాణ రంగంలో వినియోగించే ఇతర ఖనిజాల వినియోగం సైతం బాగా క్షీణించింది. దీనికి తోడు కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. మళ్లీ వారు తిరిగి వచ్చేది ఎప్పుడో. ఫలితంగా కంకర, గ్రావెల్‌, ఇసుక వినియోగం కూడా తగ్గిపోయింది.

ఉపాధికి పెనునష్టం

గనులు, నిర్మాణ రంగంలో లక్షల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చదువు-పెద్దగా నైపుణ్యం లేని వారికి గనుల రంగం పని కల్పిస్తుంది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో అటువంటి వారందరికీ ఉపాధి పోయింది. రోజువారీ ఆదాయాల మీద బతికే వారు అల్లాడిపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో..

ప్రధానంగా సిమెంటు, సున్నం తయారీలో వినియోగించే ఈ ఖనిజాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో విస్తారంగా లభిస్తాయి. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ లైమ్‌స్టోన్‌ నిల్వలు కొంతమేర ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాల్లో సిమెంటు, సున్నం తయారీ పరిశ్రమలు వేళ్లూనుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలమందికి సిమెంటు, సున్నం తయారీ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. సిమెంటు లోడింగ్‌, అన్‌లోడింగ్‌, రవాణా... తదితర విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల సిమెంటు వినియోగం మందగించింది. తయారీ చాలావరకు నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే సిమెంటు యూనిట్లు మొదలై ఉత్పత్తి దశలోకి వస్తున్నప్పటికీ, కొవిడ్‌- 19 కంటే ముందున్న నాటి పరిస్థితికి రావాలంటే చాలా కాలం పడుతుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రభుత్వం నుంచి కోరుతున్నవి ఇవీ

ఆయా సంస్థలకు నగదు లభ్యత పెంపొందించడం, రుణ వాయిదాల చెల్లింపు గడువు పొడిగించటం, జీఎస్‌టీ చెల్లింపు వాయిదా లేదా రద్దు చేయటం, వార్షిక/ అర్ధవార్షిక నివేదికలు అందించేందుకు గడువు ఇవ్వటం వంటి చర్యలు అవసరమని పరిశ్రమ కోరుతోంది. ఇనుప ఖనిజం ఎగుమతులను ప్రోత్సహించే చర్యలూ అవసరం. బొగ్గు లభ్యత, రవాణాను పెంపొందిస్తే అటు పరిశ్రమలకు, ఇటు ఉపాధి పరంగా కార్మికులకు మేలు జరుగుతుంది. పన్నుల భారాన్ని తగ్గించడం, రాయితీలు అధికంగా ఇవ్వడంపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి.

ఇవీ చూడండి: క్లినికల్ ట్రయల్స్​కు 'సన్​ఫార్మా'కు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.