ETV Bharat / city

శానా ఇబ్బంది పడుతున్నాం సారూ.. రాష్ట్రానికి తీసుకుపోండి

ఉపాధి వెతుకులాటలో సొంతూళ్లను వదిలి వందల కిలోమీటర్లలోని ఇతర ప్రాంతాలకు చేరుకుని కూలీనాలీ చేసుకుని బతుకీడుస్తున్నారు వలస కూలీలు. లాక్‌డౌన్‌ వారి జీవితాలను తలకిందులు చేస్తోంది. సొంతూళ్లకు చేరుకునే అవకాశం లేక.. ఉన్న ప్రాంతాల్లో ఉండే పరిస్థితిలేక తల్లడిల్లిపోతున్నారు. మమ్మలి రాష్ట్రాన్ని తీసుకుపోండి సారూ అంటూ 99 మంది వలస కూలీలు సర్కారుకు మెర పెట్టుకుంటున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో చిక్కుకున్న తెలంగాణ వాసుల కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం

author img

By

Published : May 31, 2020, 9:42 AM IST

శానా ఇబ్బంది పడుతున్నాం సారూ.. రాష్ట్రానికి తీసుకుపోండి
శానా ఇబ్బంది పడుతున్నాం సారూ.. రాష్ట్రానికి తీసుకుపోండి
శానా ఇబ్బంది పడుతున్నాం సారూ.

రాష్ట్రం కాని రాష్ట్రంలో అకలికి అలమటిస్తూ.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు తెలంగాణ వాసులు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో రాష్ట్ర వాసులు పడుతున్న ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. లాక్​డౌన్​ ప్రభావం వారి ఉపాధిని దెబ్బతీసింది. చేసేది లేక నేపాల్​ నుంచి రాష్ట్రానికి నడక ప్రారంభించారు. ఆకలి కేకలు ఒక వైపు.. భానుడి భగభగలు ఇంకో వైపు. అక్కడక్కడ దాతలు ఇచ్చే పండ్లు, ఫలహారాలతోనే కడుపు నింపుకుంటూ.. సాగింది వారి ప్రయాణం

"బతుకుదెరువు కోసం నేపాల్​ వెళ్లాం. లాక్​డౌన్​తో ఉపాధి కొల్పోయాం. నడుచుకుంటూ లఖ్​నవూో వరకు రాగా పోలీసులు మాకు ఇక్కడ ( శకుంతలా మిశ్రా విశ్వవిద్యాలయంలో) ఉండమని చెప్పారు. మేమంతా మహబూబ్​నగర్​, హైదరాబాద్​ జిల్లాలకు చెందిన వాళ్లం. రాష్ట్రానికి పోవడానికి మాకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. ఎట్లన్న చేసి మీరు మమ్మల్ని అక్కడికి తీసుకుపోవాలే. పిల్లలున్నరు, ఆడోళ్లున్నరు.. సీఎం సారూ మీరే మాకు సాయం చేయాలి". - ఓ వలస కూలీ

"మా తల్లిదండ్రులు మాకోసం ఏడుస్తున్నరు సార్​. మాకు మా పిల్లలకు ఇక్కడ అన్నం కూడా అందట్లే. ఎట్లన్న జేసి మమ్ముల్ని తీసుకుపోండి సార్​. శానా పరేషాన్​లో ఉన్నం".- మహిళా కూలీ

"ఇక్కడ సర్కార్​ను, తెలంగాణ సర్కార్​ను మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని రాష్ట్రానికి పంపించే ఉపాయం చేయండి. పిల్లాజల్ల ఉన్నారు. లాక్​డౌన్​లో చాలా కష్టాలు అనుభవిస్తున్నాం సార్​ అవి మీకు తెలియవు. ఏడుస్తూ.. నడుసుకుంటూ.. నడుసుకుంటూ ఇక్కడి వరకు చేరుకున్నాం. అందర్ని కోరుతున్నాం.. దయచేసి మా బాధనిఅర్ధం చేసుకొండి. ఇక్కడ దేశం కాని దేశంలో ఎవరు గుర్తుపడతారు? ఎవరు ఏం చేస్తారు?" - ఓ వలస కూలీ.

నడుచుకుంటూ.. ఏడ్చుకుంటూ.. ఎవరైనా సాయం చేయకపోతారా అంటూ ఎదురుచూస్తూ.. వీరు పడిన గోస మాటల్లో చెప్పలేం. సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి ఎంత కష్టాన్నైనా కళ్లలో నింపుకుని, కాళ్లకు ధైర్యం చెప్తూ లఖ్​నవూ వరకు సాగింది వీరి ప్రయాణం.

ఇవీ చూడండి: దేశంలో అన్ని జిల్లాల నీటికి నాణ్యత పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.