ETV Bharat / city

Top News: టాప్​న్యూస్​ @7 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TELANGANA LATEST TOP NEWS
TELANGANA LATEST TOP NEWS
author img

By

Published : Feb 17, 2022, 6:58 PM IST

  • సీఎం కేసీఆర్​ వినూత్నంగా బర్త్​డే విషెస్​..

KCR Birthday: ఏపీలోని కడియం నర్సరీలో సీఎం కేసీఆర్​కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ రూపాన్ని మొక్కలు, పూలు, కూరగాయలు, నవధాన్యాలతో తీర్చిదిద్దారు. తెలంగాణలో హరితహారం పథకం ద్వారా కడియం నర్సరీలకు సీఎం కేసీఆర్​ ఎంతో మేలు చేశారని రైతు శ్రీనివాస్ తెలిపారు.

  • వెయ్యికోట్లతో ఎంఆర్​ఎఫ్​ ఇండియా విస్తరణ..

MRF India Expansion : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా తెలంగాణలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని సంగారెడ్డిలో వెయ్యి కోట్ల పెట్టుబడితో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

  • ఫిబ్రవరి 17 ఇక నుంచి నిరుద్యోగ దినం..

February 17th Unemployment Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. లక్షలాది ఖాళీలున్నాయన్న ఆయన... సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ​

  • మేడారంలో ప్రత్యేక ఆకర్షణగా మ్యూజియం..

Medaram Jathara 2022: మేడారం జాతరకు వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్న భక్తులకు ఆదివాసీ, గిరిజన మ్యూజియం స్వాగతం పలుకుతోంది. పిల్లలు, పెద్దలను ఆకర్షిస్తూ.. ఆనాటి గిరిజన, ఆదివాసీల బతుకు చిత్రాన్ని పరిచయం చేస్తోంది. ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.

  • 20లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగు..

Oil Palm Expansion : రాష్ట్రంలో ఆయిల్‌పాం పంట సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. పంట, సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ ఆయిల్‌ఫాం, ముడి నూనెల మిషన్ కింద సమగ్ర విధానంలో రైతుల్లో ఆయిల్‌పాం సాగు చేయించేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటోంది.

  • వాటర్ క్యాన్​లో చిరుత పిల్ల తల..

Leopard cub: ఓ చిరుత పులికి వింత అనుభవం ఎదురైంది. నీరు తాగేందుకు ప్రయత్నించగా.. వాటర్ క్యాన్​లో తల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా రాకపోయే సరికి అడవి, ఊరు అనే తేడాలేకుండా తిరిగింది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది దానిని రక్షించారు.

  • ఆవు దూడపై సామూహిక అత్యాచారం..

Cow Calf Sodomized: కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు దుండగులు దారుణ చర్యకు పాల్పడ్డారు. ఆవు దూడతో అసహజ శృంగారం చేశారు. వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • దిగ్గజ ఫుట్​బాల్​​ ప్లేయర్ కన్నుమూత..

Surajit Sengupta Footballer: ఫుట్​బాల్​ మాజీ ఆటగాడు సురజిత్​ సేన్​గుప్తా గురువారం మరణించారు. గత కొంతకాలంగా కరోనా కారణంగా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గతంలో ఆయన భారత ఫుట్​బాల్ జట్టుకు మిడ్​ ఫీల్డర్​గా సేవలు అందించారు.

  • తొలిరోజు సెంచరీల మోత..

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీకి అద్భుతమైన ప్రారంభం లభించింది. తొలిరోజే సెంచరీల మోత మోగింది. సీనియర్లతో పాటు యువ బ్యాటర్లు చెలరేగారు. దీంతో శతకాలు నమోదయ్యాయి.

  • ప్రభాస్​ పవన్​ కల్యాణ్ సర్​ప్రైజ్..

Pawan kalyan prabhas: అగ్రకథానాయకుడు పవన్​.. యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్​ను సర్​ప్రైజ్ చేశారు. మరోవైపు 'భీమ్లా నాయక్' విశేషాలను పవన్​ను అడిగి తెలుసుకున్నారు అమితాబ్. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.