ETV Bharat / city

టాప్​న్యూస్ ​@9 PM - telangana latest news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
telangana latest top news
author img

By

Published : Dec 31, 2021, 9:01 PM IST

  • న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​కు సిద్ధమవుతున్నారా..

New Year Restrictions in Hyderabad: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే... ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్​, రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్ల​ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఓఆర్​ఆర్​పై కార్లకు అనుమతి నిరాకరించారు. పలు ప్రాంతాల్లో పైవంతెనలు మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. కొన్ని చోట్ల దారి మళ్లించినట్లు చెప్పారు.

  • 'మళ్లీ మేమే వస్తాం.. ఐటీ హబ్​ను ప్రారంభిస్తాం'

IT Hub in Nalgonda: ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్​ అన్నారు. నల్గొండలో ఐటీ హబ్​ ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పట్టణంలో మంత్రులు కేటీఆర్​, జగదీశ్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాల ఆవరణలో ఐటీ హబ్​కు కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఆయన​ ప్రారంభించారు.

  • 'ఫ్లొరోనా' పేరుతో కొత్త వ్యాధి-

Israel Florona disease: ఇజ్రాయెల్​లో ఫ్లొరోనా వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి కేసు వెలుగు చూసింది.

  • 14 ఏళ్ల దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్..

Madhya Pradesh gang rape: 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కిరాతకులు. నిందితుల్లో 60 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. బాలిక అస్వస్థతకు గురైన తర్వాత వైద్య పరీక్షలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  • విద్యుత్ బోటులో తొలి రైడ్​!

Electrical boat: బ్యాటరీతో నడిచే కార్లు, బైకుల గురించి మనకు తెలుసు. అయితే... బ్యాటరీతో నడిచే బోటును ఎప్పుడైనా చూశారా? కేరళకు వెళ్తే అక్కడి 'వాటర్ మెట్రో ప్రాజెక్టు'లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ తరహా బోటును మనం చూడొచ్చు. ఈ విద్యుత్ బోటులో బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..?

  • ఆ రెండు కంపెనీలకు రూ.1000 కోట్లు ఫైన్!'

IT Raids on Foreign Companies: దేశంలో విదేశీ నియంత్రణలో ఉన్న మొబైల్ కంపెనీలు వేలకోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. లెక్కకురాని రూ.6,500 కోట్ల లావాదేవీలను గుర్తించింది.

  • సిడ్నీలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుక

ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. సిడ్నీలో కన్నుల పండువగా బాణసంచా పేల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ప్రజలు. ఏటా ఇక్కడ న్యూ ఇయర్​ వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. వీటిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచదేశాల నుంచి పర్యటకులు కూడా వస్తుంటారు.

  • 2022కి న్యూజిలాండ్ స్వాగతం

New zealand welcomes new year: 2022 సంవత్సరానికి న్యూజిలాండ్​ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్‌ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్​ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు. దీంతో ప్రపంచంలోనే 2022 ఏడాదికి స్వాగతం పలికిన తొలిదేశంగా న్యూజిలాండ్ నిలిచింది.

  • 'లా లా భీమ్లా' పాట డీజే వెర్షన్​ ఆగయా..

అభిమానుల్లో ఇప్పటికే అలరిస్తున్న 'లాలా భీమ్లా' సాంగ్.. సరికొత్తగా డీజే వెర్షన్​ కూడా వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ పాట రిలీజైంది.

  • దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​కు రోహిత్ దూరం..

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. తొడ కండరాల సమస్య నుంచి ఇంకా అతడు కోలుకోలేదు. దీంతో కేఎల్​ రాహుల్.. కెప్టెన్​గా బాధ్యతలు అందుకోనున్నాడు. బుమ్రా వైస్​ కెప్టెన్సీ చేయనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.