ETV Bharat / city

టాప్​న్యూస్​@7 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
telangana latest top news
author img

By

Published : Dec 31, 2021, 6:59 PM IST

  • మూసీ ఒడ్డున భారీ అగ్నిప్రమాదం..

Fire accident at chaderghat: హైదరాబాద్​లోని చాదర్​ఘాట్​ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చాదర్​ఘాట్​లోని మూసీ ఒడ్డున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 40 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి గుడిసెల్లో ఉన్న రెండు సిలిండర్లు పేలాయి. సిలిండర్లు పేలిన శబ్ధానికి భయపడి ప్రజలు పరుగులు తీశారు.

  • నెత్తురోడిన ఓఆర్​ఆర్​...

Accidents on Hyderabad ORR: భాగ్యనగరానికి మణిహారంగా ఉన్న బాహ్యవలయ రహదారి ప్రతి ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటోంది. గత ఐదేళ్లలో ఏటా ఈ సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఔటర్‌ రింగ్‌రోడ్‌పై ప్రమాదాలకు కారణాలు తెలిసినా వాటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదు.

  • 6 లక్షలకు పైగా రైతులకు లబ్ధి

Rythu bandhu On Fourth Day: యాసంగి సీజన్​కు సంబంధించిన రైతుబంధు సాయం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నాలుగోరోజు 6 లక్షల 75 వేల 824 మంది రైతులకు నగదు సాయం అందింది. 1144.64 కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి.

  • 'ఒమిక్రాన్' విజృంభణ..!

Omicron replacing delta: దేశంలో కరోనా డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భర్తీ చేయడం ప్రారంభమైందని అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్​ సోకిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 80శాతం మంది 'ఒమిక్రాన్' బాధితులేనని చెప్పాయి.

  • 'అందుకే అఖిలేశ్​ వణికిపోతున్నారు'

Nirmala On IT Raids: ఉత్తర్​ప్రదేశ్​లో ఇటీవల జరిగిన ఐటీ దాడుల గురించి మాట్లాడారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. పక్కా సమాచారంతో సరైన వ్యక్తిపైనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు. బయటపడ్డ రూ. 200 కోట్లు.. భాజపా సొమ్మేం కాదని, పర్ఫ్యూమ్​ వ్యాపారి పీయూష్​ జైన్​దేనని స్పష్టం చేశారు.

  • 'రామ్​ లల్లాను టెంటు కింద ఎవరు ఉంచారో మర్చిపోవద్దు'

Amit shah in Ayodhya: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్​ పార్టీలే అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. కరసేవకులను కాల్చి చంపింది ఎవరో? రామ్ లల్లా కొన్ని సంవత్సరాల పాటు టెంటు కిందే ఉండటానికి కారణమెమరో? ప్రజలు గుర్తు చేసుకోవాలని సూచించారు. పన్ను ఎగ్గొట్టిన సుగంధ ద్రవ్యాల వ్యాపారులపై ఐడీ దాడులు జరిగితే అఖిలేశ్ ఎందుకు నీరసపడిపోతున్నారని ఎద్దేవా చేశారు అమిత్ షా.

  • 2021లో 'అమ్మ'గా మారిన తారలు

కరోనా చాలా జీవితాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. ఇటువంటి సమయంలో కొందరి జీవితాల్లోకి కొత్త వ్యక్తిని పంపి సంతోషాన్ని పంచింది 2021. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, కరీనా కపూర్​-సైఫ్​ అలీఖాన్​ సహా ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారిన బాలీవుడ్​ తారలెవరో చూద్దామా.

  • 'ఆర్ఆర్ఆర్' టికెట్ ధర ఎంతంటే?

TFPC meeting: తెలంగాణ ప్రభుత్వం జీవో నం 120 ప్రకారం చిన్న సినిమాల టికెట్లను అందుబాటు ధరలోనే అమ్మాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.

  • 'పుష్ప' డిలీటెడ్ సీన్..

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, ఆచార్య, అఖండ, సేనాపతి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

  • టీమ్‌ఇండియా వరుసగా మూడో 'బాక్సింగ్‌ డే' విజయం

Boxing Day Test: ఇప్పటి వరకు 10 బాక్సింగ్​ డే టెస్టులాడిన భారత్​.. మూడింట మాత్రమే గెలుపొందింది. సెంచూరియన్​లో దక్షిణాఫ్రికాపై మ్యాచ్​తో ఈ మూడో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఈ విజయం బాక్సింగ్​ డే టెస్టుల్లో భారత్​కు వరుసగా మూడోది కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.