ETV Bharat / city

టాప్​న్యూస్​@ 5PM - తెలుగు తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest top news
telangana latest top news
author img

By

Published : Dec 30, 2021, 4:59 PM IST

  • టీమ్​ఇండియా ఘన విజయం

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ శుభారంభం చేసింది. సెంచరియన్​ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను 191 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 113 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • గోరటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Gorati Venkanna: కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అపూర్వగౌరవం దక్కింది. 2021 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 'వల్లంకి తాళం' కవితా సంపుటికి ఈ పురస్కారం వచ్చింది. మానవీయ సంస్కృతి, స్వచ్ఛమైన ప్రకృతి మేళవింపుగా 'వల్లంకి తాళం' కవిత సంపుటిని గోరటి తీర్చిదిద్దారు. కేంద్ర సాహిత్య పురస్కారం రావడంపై గోరటి వెంకన్న ఆనందం వ్యక్తంచేశారు.

  • 'మా విన్నపం వినకపోయినా.. మీవాళ్ల మాటైనా వినిపించుకోండి'

KTR Tweet On Textiles GST: టెక్స్​టైల్స్​పై జీఎస్టీ తగ్గించాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయగా.. ప్రస్తుతం మరోసారి ట్విట్టర్​ వేదికగా తనదైన శైలిలో విన్నవించుకున్నారు. "మా విన్నపాన్ని పట్టించుకోవట్లేదు సరే.. మరి మీ వాళ్ల మాటలైనా వినిపించుకోండి" అంటూ.. కేంద్రమంత్రికి ట్వీట్​ చేశారు.

  • పోలీస్​ బాస్​ ఏమన్నారంటే..?

DGP on New Year Celebrations: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర పోలీస్​ బాస్​ స్పష్టం చేశారు.

  • ప్రజలకు ఆరోగ్య శాఖ వార్నింగ్!

Health Ministry On Covid: దేశంలో రోజువారీ కొవిడ్-19 కేసులు 10వేలకుపైగా నమోదవడంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 8 జిల్లాల్లో కరోనా వారాంతపు పాజిటివిటీ రేటు 10శాతం కంటే అధికంగా నమోదవుతోందని, మరో 14 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం ఉందని పేర్కొంది.

  • రూ.17వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

Modi Uttarakhand Visit: ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరాఖండ్​లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

  • యూట్యూబ్​ చూసి దొంగ నోట్లు ప్రింటింగ్​

Fake Currency Racket Maharashtra: యూట్యూబ్​లో చూసి దొంగ నోట్లు తయారు చేయడమే కాక వాటిని చలామణి చేస్తున్న ఇంజినీర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,20,000 విలువ గల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

  • 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్​ సీక్వెన్స్​ కోసం 65 రాత్రులు

RRR Interval: 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ పార్ట్​ షూటింగ్​కు సంబంధించిన క్రేజీ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ సీక్వెన్స్ ఎన్ని రోజులు చిత్రీకరణ చేశారు? ఖర్చు ఎంతైందంటే?

  • కరోనా ఎఫెక్ట్​ గట్టిగానే ఉందని నటి పోస్ట్

Nora fatehi covid: వైరస్​ బారిన పడిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి.. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉంది. తనపై కొవిడ్ ప్రభావం గట్టిగానే ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

  • ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

Stock Market Today: స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 12 పాయింట్లు తగ్గింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ అతి స్వల్పంగా 10 పాయింట్లు నష్టపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.